Read more!

English | Telugu

సూపర్ స్టార్ ను కోల్పోయిన మెగాస్టార్

 

ప్రముఖ నిర్మాత స్థాపించిన "క్రియేటివ్ కమర్షియల్స్" సంస్థ 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిరుకి వచ్చిన మెగాస్టార్ బిరుదు గురించి ఓ మాట చెప్పారు. అదేంటంటే... 'మరణమృదంగం' సినిమా సమయంలో చిరంజీవికి సూపర్ స్టార్ బిరుదు ఇద్దామనుకున్నాం. కానీ అప్పటికే ఆ బిరుదుతో కృష్ణగారు పాపులర్. అందుకే 'మెగాస్టార్' బిరుదు ఇచ్చామని కెఎస్ అన్నారు.

ఈ విషయం ఒక రెండు, మూడు సంవత్సరాల ముందు చెప్పి ఉంటే అభిమానులు పండగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు చిరంజీవిని కనీసం మనిషిలాగా కూడా చూడటం మానేసారు జనాలు. ఇక 'మెగాస్టార్', 'సూపర్ స్టార్' అని ఎవరు పిలుస్తారు చెప్పండి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో చిరు క్యూ పాటించకపోతే అక్కడున్న ఓ వ్యక్తి చిరుని అదరగొట్టేశాడు. అంటే ప్రస్తుతం జనాల్లో చిరుపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమవుతుంది.

ఈ దెబ్బతో చిరు తన రాజకీయ జీవితం ఏమో కానీ.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ 150వ సినిమా ఇక పూర్తిగా ఉండదని నిర్ధారణ అయినట్లుగానే కనిపిస్తుంది. ఒకవేళ ధైర్యం చేసి చిరు 150వ సినిమా తీస్తే మెగా ఫ్యామిలీ మాత్రమే చూస్తారు కావచ్చు. ఎందుకంటే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణాలో చిరుకి అభిమానులు కరువయ్యారు. తన వైఖరితో 'మెగాస్టార్' అని పిలుపుకు చిరు ఎప్పుడో దూరమయ్యడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అప్పట్లో కృష్ణ గారి వల్ల చిరుకి సూపర్ స్టార్ బిరుదు మిస్సయ్యిందని బాధపడాలో లేక ఇపుడు చిరుకి మెగాస్టార్ అనే బిరుదు కూడా ఎందుకు పెట్టారో అని బాధపడాలో అర్థం కావటం లేదు.