English | Telugu
జూనియర్‌కు ఏమైంది...ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు ఎన్టీఆర్
Updated : Mar 15, 2017
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ఎవరితో సినిమా తీస్తాడు..కథ ఎలా ఉండబోతోంది. అంటూ అభిమానులను రకరకాల ప్రశ్నలు వేధించాయి. వీటన్నింటికి తెరదించుతూ బాబీ డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు యంగ్‌టైగర్. ఈ మూవీలో కెరీర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు ఎన్టీఆర్. మూడు పాత్రల్లో వైవిధ్యాన్ని చూపించేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాడు జూనియర్.
ఈ నేపథ్యంలో ఓ పాత్ర కోసం భారీగా బరువు తగ్గాలని డైరెక్టర్ బాబీ చెప్పాడట. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 10 నుంచి 15 కిలోల బరువు తగ్గాలని బాబీ క్లారిటీ ఇచ్చాడట. షూటింగ్ అల్రెడీ మొదలవ్వడం సమయం తక్కువగా ఉండటంతో ఓ ప్రత్యేక చికిత్స చేయించుకుని బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లాడట. చికిత్స పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చిన తర్వాత తారక్ షూటింగ్‌లో పాల్గొంటాడని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్టీఆర్‌కు ట్రీట్‌మెంట్ అనేసరికి అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.