English | Telugu
ఆ నిర్మాత కూతురితో గోపీచంద్ పెళ్ళి
Updated : Mar 23, 2011
నిర్మాత ఆనందప్రసాద్ కి కూకట్ పల్లిలో భ్రమరాంబ, మల్లికార్జున అనే పేరుగల రెండు థియేటర్లూ, పద్మజ ప్లాజా అనే ఒక షాపింగ్ కాప్లెక్స్, భవ్య సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ఇలా అనేక వ్యాపారాలున్నాయి. అటువంటి ఆనందప్రసాద్ తన కుమార్తెను హీరో గోపీచంద్ కిచ్చి వివాహం చేయాలనుకుంటున్నారనీ, ఈ సంబంధం దాదాపు నిశ్చయమయ్యిందనీ, కట్నకానుకలకు ఏ మాత్రం లోటుండదనీ, అన్నీ కలిసొస్తే వచ్చే వేసవి కాలంలోనే ఈ వివాహం జరుగుతుందనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.