Read more!

English | Telugu

వెంకీ కాదన్నా ఆమెను నాని ఒప్పుకున్నాడట...!

 

వెంకటేష్ కోసం తేజ "సావిత్రి" అనే టైటిల్ తో ఓ కథను నాలుగేళ్ళ క్రిందే సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ మొత్తం లేడి ఓరియెంటెడ్ తరహాలో ఉంటుందని భావించిన వెంకీ..ఈ ప్రాజెక్టును వదులుకున్నాడు. అయితే ఆ కథను మళ్ళీ దుమ్ము దులిపి సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు తేజ. ఇటీవలే ఈ కథను హీరో నానికి వినిపించాడట తేజ, కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట నాని. ప్రస్తుతం తేజ "తప్పు" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత "సావిత్రి" సినిమా ప్రారంభం అవుతుందని టాక్. మరి వెంకటేష్ కు నచ్చని సావిత్రి నానికి ఎలా నచ్చింది? ఈ విషయం తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచిచూడాల్సిందే.