English | Telugu

దిల్ రాజు పతనాన్ని కోరుకుంటుంది ఎవరు?

దిల్ రాజు పతనాన్ని కోరుకుంటుంది ఎవరు?

సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ వరుస విజయాలతో అగ్ర నిర్మాతగా ఎదిగారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు(Dil Raju).ఈ సంక్రాంతి కానుకగా ఆయన బ్యానర్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం'అనే రెండు డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వాటిల్లో 'సంక్రాంతి కానుకగా వస్తున్నాం' పాజిటివ్ టాక్ తో 
ముందుకు దూసుకుపోతుంది.గేమ్ చేంజర్ మాత్రం నెగిటివ్ టాక్ తో రన్ అవుతు ఉంది.

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించగా వెంకటేష్(Venkatesh)తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)కూడా పాల్గొన్నాడు.దిల్ రాజు సోదరుడు సంక్రాంతికి వస్తున్నాం నిర్మాతల్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతు అనిల్ రావిపూడి లేకపోతే మేము లేం.చాలా మంది మేము పోవాలని అనుకున్నారు.కానీ అనిల్ మాత్రం ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందని చెప్పేవాడు.పైన తధాస్తు దేవతలు ఉన్నారనుకుంటా అలాగే జరిగింది.మేము బావిలో పడుతున్నామని కొంత మంది సంతోషపడుతున్నారు.కానీ ఇప్పుడు లేచి ఈ సినిమాతో వాళ్ళ పక్కనే ఉన్నాం.ఈ క్రెడిట్ మొత్తం అనిల్ కే చెందుతుందని చెప్పాడు.

 

మైత్రి మూవీస్ బ్యానర్ కి దిల్ రాజుకి గొడవలు ఉన్నాయని,శిరీష్ చేసిన వ్యాఖ్యలు మైత్రిని ఉద్దేశించి చేసిందనే రూమర్స్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తు ఉన్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజు కి తన బ్యానర్ కి తగ్గ హిట్ లేదు.దీంతో దిల్ రాజు పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు.ఇండస్ట్రీలో మాత్రం శిరీష్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీసాయి.

 

దిల్ రాజు పతనాన్ని కోరుకుంటుంది ఎవరు?