English | Telugu

గబ్బర్‌సింగ్ అయితే డబుల్ ఓకే - దీపికా


ఏమిటో, బాలీవుడ్‌కి టాలీవుడ్ కథలన్నా, హీరోయిన్లు అన్నా, టెక్నీషియన్స్ అన్నా అభిమానం రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా పవన్ ఆఫర్ ఇస్తే డేట్లు వెంటనే ఇచ్చేస్తా అంటోంది బాలీవుడ్ బిజీ హీరోయిన్ దీపికా పదుకొనే. గత ఏడాది 500 కోట్ల హీరోయిన్‌గా కాసులు కురిపించింది దీపికా పదుకొనే. హీందీతో పాటు అప్పుడప్పుడు దక్షిణాది సినిమాల్లో మెరుస్తుంటుంది ఈ బెంగుళూరు భామ. ఈమె నటించిన 'కొచ్చాడియాన్'(విక్రమసింహా) ఇటీవలే విడుదలైంది. అయితే ఇప్పటి వరకూ తెలుగులో నేరుగా ఇప్పటివరుకూ దీపికా ఏ చిత్రంలోనూ నటించలేదు.


సినిమాలు, రాజకీయాల్లోనూ తన పవరేంటో చూపించిన మన గబ్బర్‌సింగ్ పై మనుసుపారేసుకుందో ఏమో ఈ భామ తెలుగులో నటించడానికి సరేనంటోందట.గబ్బర్‌సింగ్-2 చిత్రం కోసం ఎప్పటి నుంచో హీరోయిన్ కోసం చూస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఇప్పుడు పవన్ కూడా రాజకీయ పనులు ముగించుకొని సినిమా పనుల్లో పడిపొవడంతో హీరోయిన్ కోసం సెర్చ్ మళ్లీ బిగిన్ చేశారు. మామూలుగా దీపిక హిందీ సినిమాలతో చాలానే బిజీగా ఉన్నా, పవన్ నుంచి ఆఫర్ వస్తే డేట్స్ ఇచ్చేస్తానని చెప్పడంతో నిర్మాతలు ఆల్‌రెడీ ఆమెను కలిసే పనుల్లో ఉన్నారట.