English | Telugu

చిరంజీవి సినిమాలో డర్టీ గర్ల్


డర్టీ పిక్చర్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ చిరంజీవితో కలిసి నటించనుంది అనే విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిగా మారుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం ఇప్పటి వరకూ అఫీషియల్ గా బయటకు రానప్పటికీ టాక్స్ మాత్రం వినిపిస్తున్నాయి.

చిరూ సినిమాలో విద్యాబాలన్ ఒక స్పెషల్ రోల్ కనిపించనున్నది అనేది ఇప్పుడుతాజాగా వినిపిస్తున్న విషయం. చిరంజీవి 150వ సినిమా వివరాలు ఆగస్టులో ఆయన పుట్టినరోజున అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ఈ లోపు సినిమాకు సంబంధించిన చర్చలు, నిర్ణయాలు, కథ తదితర అంశాలు అన్నిటిపై పనులు జరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏమైనా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భాగమైతే పబ్లిసిటీ పరంగా మరింత ప్లస్ అవుతుందనటంలో డౌట్ లేదు.