English | Telugu
'దేవర-2'లో మరో స్టార్ హీరో..!
Updated : Sep 29, 2025
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన 'దేవర' మూవీ గతేడాది సెప్టెంబర్ లో విడుదలై.. భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కంటెంట్ పరంగా పూర్తిస్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయినప్పటికీ.. అదిరిపోయే వసూళ్లతో సర్ ప్రైజ్ చేసి, కమర్షియల్ సక్సెస్ సాధించింది. దేవర పార్ట్-2 ఉన్నట్లు టీమ్ ముందే ప్రకటించింది. అయితే.. కంటెంట్ పరంగా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోవడం, ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ కావడం.. వంటి కారణాలతో దేవర-2 ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం దేవర-2 ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఇటీవల దేవర విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా.. మేకర్స్ కూడా పార్ట్-2 ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం దేవర-2 కి సంబంధించిన చర్చ జరుగుతోంది. (Devara 2)
దేవరకి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని.. పార్ట్-2 విషయంలో కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇప్పటికే అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. పార్ట్-1 తో పోలిస్తే.. క్యారెక్టర్స్ పరంగా, సీన్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందట. అంతేకాదు, దేవర-2 లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా రాబోతున్నాయట. ముఖ్యంగా ఓ పవర్ ఫుల్ రోల్ కోసం కోలీవుడ్ హీరో శింబుని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ తో పాటు మరో బ్యూటీని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక టెక్నికల్ టీమ్ పరంగానూ కొన్ని మార్పులు జరగనున్నట్లు వినికిడి. చూద్దాం మరి 'దేవర-2'తో ఎన్టీఆర్-కొరటాల మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంటారేమో.