English | Telugu

జాక్ పాట్ కొట్టిన నాని డైరెక్టర్.. ఏకంగా సూపర్ స్టార్ తో..!

జాక్ పాట్ కొట్టిన నాని డైరెక్టర్.. ఏకంగా సూపర్ స్టార్ తో..!

 

'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ (Vivek Athreya).. 'బ్రోచేవారెవరురా', 'అంటే సుంద‌రానికీ', 'సరిపోదా శనివారం' వంటి సినిమాలతో ఆకట్టుకొని ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన మొదటి రెండు సినిమాలను శ్రీవిష్ణుతో, ఆ తర్వాత రెండు సినిమాలను నానితో చేసిన వివేక్.. తన ఐదో సినిమా కోసం ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. (Rajinikanth)

 

'పుష్ప-2'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. ఓ వైపు టాలీవుడ్ స్టార్స్ తో భారీ సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర భాషలకు చెందిన స్టార్స్ తోనూ సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల అజిత్ కుమార్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ', సన్నీ డియోల్ తో 'జాట్' సినిమాలు చేసింది. ఇప్పుడు రజినీకాంత్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రజినీకాంత్ ఇమేజ్ కి తగ్గ కథ వివేక్ ఆత్రేయ దగ్గర ఉందట. ఇప్పటికే రజినితో కథా చర్చలు జరగగా.. ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.