English | Telugu

శ్రీను వైట్లకు హీరో దొరికేశాడు.. ఈసారి కామెడీ మామూలుగా ఉండదు!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో శ్రీను వైట్ల ఒకరు. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. అయితే శ్రీను వైట్ల, 2013లో వచ్చిన బాద్‍షా తర్వాత హిట్ చూడలేదు. వరుసగా ఐదు సినిమాలు నిరాశపరిచాయి. గత చిత్రం 'విశ్వం'తో కమ్ బ్యాక్ ఇస్తారు అనుకుంటే.. అదీ పరాజయంపాలైంది. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు శ్రీను వైట్ల.

నితిన్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది అంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అయితే నితిన్ కోసం శ్రీను వైట్ల అనుకున్న కథ.. ఇప్పుడు శర్వానంద్ దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో సినిమా చేయడానికి శర్వా ఓకే చెప్పినట్లు సమాచారం.

శ్రీను వైట్ల ఈసారి ఎలాగైనా అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలనే కసితో.. తన ట్రేడ్ మార్క్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లు వినికిడి. శ్రీను వైట్ల శైలి ఎంటర్టైనింగ్ కథలు శర్వాకి సరిగ్గా సరిపోతాయి. దాంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు.