English | Telugu
విడాకుల బాటలో శర్వానంద్ దంపతులు.. అసలేం జరిగింది?
Updated : Sep 19, 2025
ప్రేమ పెళ్ళి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి అనే తేడా లేకుండా.. ఈ మధ్య కాలంలో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ తంతు ఎక్కువగా కనిపిస్తోంది. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట.. ఒక్కసారిగా విడిపోతున్నారు. ఇక ఇప్పుడు హీరో శర్వానంద్ దంపతుల వంతు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. (Sharwanand)
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో శర్వానంద్ ఒకడు. గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, శతమానం భవంతి వంటి సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. 2023లో రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వివాహం చేసుకున్నాడు. వీరికి గతేడాది పాప పుట్టింది.
శర్వానంద్-రక్షిత ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అలాంటిది కొంతకాలం నుంచి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందరిలా ఆవేశంగా విడాకుల జోలికి పోకుండా.. ప్రస్తుతానికి ఇద్దరు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే కొద్దిరోజుల నుంచి వేరువేరుగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి.
శర్వా, రక్షిత కలిసి ఉండట్లేదనే వార్త విని అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం.. వారి మధ్య మనస్పర్థలు త్వరగా తొలిగిపోయి, మునుపటిలా కలిసి ఉండాలని ఆశిస్తున్నారు.