English | Telugu
తారక్ తో శంకర్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్!
Updated : May 15, 2022
దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో కోలీవుడ్ కెప్టెన్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ పాన్ - ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. వచ్చే ఏడాది వేసవికి జనం ముందుకు రానుంది. ఆపై రణ్ వీర్ సింగ్ తో `అపరిచితుడు` తాలుకూ హిందీ రీమేక్ తీయనున్నారు శంకర్. అలాగే, పెండింగ్ లో ఉన్న `ఇండియన్ 2`ని కూడా ఫినిష్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారని టాక్.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ శంకర్ ఓ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలుచేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని, ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. మరి.. ఎన్టీఆర్ - శంకర్ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే, రీసెంట్ గా `ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. త్వరలో కొరటాల శివ కాంబో మూవీని పట్టాలెక్కించనున్నారు. ఆపై `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తోనూ, `ఉప్పెన` నిర్దేశకుడు బుచ్చిబాబు సానాతోనూ ఎన్టీఆర్ నెక్స్ట్ వెంచర్స్ ప్లానింగ్ లో ఉన్నాయి.