Read more!

English | Telugu

'రాధేశ్యామ్' దర్శకుడితో రామ్ పోతినేని మూవీ!

ఇటీవల 'ది వారియర్'తో ఘోర పరాజయాన్ని చూసిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనుంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

'జిల్'(2015) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ కుమార్.. రెండో సినిమా 'రాధేశ్యామ్'తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఆ చిత్రం దారుణంగా నిరాశపరిచి ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రాధాకృష్ణ ఓ మీడియం రేంజ్ సినిమాతో తనని తాను నిరూపించుకోవాలి అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ఓ కథను సిద్ధం చేసి రామ్ కి వినిపించగా, రామ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల మాస్ జపం చేస్తున్న రామ్ కి రాధాకృష్ణ ఎలాంటి కథ చెప్పి ఉంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ చిత్రంతోనైనా రాధాకృష్ణ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.