Read more!

English | Telugu

శంక‌ర్ 'జెంటిల్‌మ్యాన్‌'ను మిస్ చేసుకున్న రాజ‌శేఖ‌ర్‌! అది చేసుంటేనా..

 

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా మొట్ట‌మొద‌టి సినిమా 'జెంటిల్‌మ్యాన్' (1993). అర్జున్ టైటిల్ రోల్ చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యిందో మ‌న‌కు తెలుసు. త‌మిళంలో తీసిన ఆ సినిమా తెలుగులో డ‌బ్బ‌యి, ఇక్క‌డ కూడా విజ‌య‌దుందుభి మోగించింది. అర్జున్‌ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసాఫీస‌ర్‌గా చ‌ర‌ణ్‌రాజ్ వేసే ఎత్తులు, అత‌డికి దొరక్కుండా దొంగ‌త‌నాలు చేస్తూ అర్జున్ వేసే పైఎత్తులు, అర్జున్‌-మ‌ధుబాల రొమాన్స్ ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించాయి. ఆ సినిమాని చిరంజీవి హిందీలో సేమ్ నేమ్‌తో రీమేక్ చేసి, హిట్ కొట్టారు.

అలాంటి 'జెంటిల్‌మ్యాన్' సినిమాని మొద‌ట శంక‌ర్ ఎవ‌రితో తీయాల‌నుకున్నారో తెలుసా?  డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో! య‌స్‌. శంక‌ర్ ఫ‌స్ట్ చాయిస్ రాజ‌శేఖ‌ర్‌. ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ చేత‌ప‌ట్టుకొని మ‌రీ ఆయ‌న రాజ‌శేఖ‌ర్‌కు క‌థ చెప్ప‌డానికి వ‌చ్చారు. హీరో రోల్‌కు రాజ‌శేఖ‌ర్ అయితే యాప్ట్‌గా ఉంటార‌ని ఆయ‌న భావించారు. అప్ప‌ట్లో 'ఆహుతి', 'అంకుశం' లాంటి సినిమాల‌తో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా రాజ‌శేఖ‌ర్ మంచి క్రేజ్ తెచ్చుకొని ఉన్నారు. 'జెంటిల్‌మ్యాన్‌'ను వ‌దులుకోవాల్సి రావ‌డం త‌న కెరీర్‌లో బిగ్ లాస్ అని రిగ్రెట్ అయ్యారు రాజ‌శేఖ‌ర్.

శంక‌ర్ క‌లిసే స‌మ‌యానికి కె. రాఘ‌వేంద్ర‌రావుతో 'అల్ల‌రి ప్రియుడు' సినిమా చేయ‌డానికి అంగీక‌రించి, దానికి డేట్స్ ఇచ్చేశారు రాజ‌శేఖ‌ర్‌. 'జెంటిల్‌మ్యాన్' క‌థ ఆయ‌న‌కు తెగ న‌చ్చేసింది. అయితే దానికి డేట్స్ అప్ప‌టిక‌ప్పుడు ఇవ్వ‌డానికి ఆయ‌నకు వీల‌వ‌లేదు. "అప్ప‌ట్లో చాలామంది హీరోలకు ఎన్ని సినిమాల‌కైనా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌గ‌ల టాక్టీస్ ఉంది. నాకు ఆ టాక్టీస్ లేదు. 'అల్ల‌రి ప్రియుడుకు ఇచ్చిన డేట్స్‌ను మార్చ‌లేను, మార్చ‌మ‌ని వాళ్ల‌ను అడ‌గ‌లేను. సారీ అండీ.. దాని త‌ర్వాత ప్లాన్ చేస్తే డేట్స్ ఇవ్వ‌గ‌ల‌ను. ఇప్పుడైతే చెయ్య‌లేను' అని వారికి చెప్పాను. అప్పుడు వాళ్లు ప‌ది ల‌క్ష‌లు అడ్వాన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ నేను దాన్ని చెయ్య‌లేక‌పోయాను. ఐ మిస్డ్‌ ఇట్‌. రియ‌ల్లీ.. అది బిగ్ లాస్." అని చెప్పారు రాజ‌శేఖ‌ర్‌.