English | Telugu
వెంకీతో నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. ఏంటో తెలుసా!
Updated : Aug 29, 2023
కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. ఒకే ఏడాదిలో తెలుగు తెరపై కథానాయకులుగా అరంగేట్రం చేశారు. 1986 మే 23న విక్రమ్ చిత్రంతో నాగ్ హీరోగా ఎంట్రీ ఇస్తే.. అదే ఏడాది ఆగస్టు 14న కలియుగ పాండవులుతో వెంకీ కథానాయకుడిగా మొదటి అడుగేశారు. ఇద్దరు కూడా ఫస్ట్ ఎటెంప్ట్ లోనే సక్సెస్ చూశారు. ఆపై ఇద్దరు కూడా విభిన్న ప్రయత్నాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోలుగా ఎదిగారు. వీరికి బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, నాగ్ - వెంకీ మల్టిస్టారర్ చేస్తే చూడాలన్నది చాలామంది కోరిక. అది నెరవేరకపోయినా.. ఈ ఇద్దరు రెండు సినిమాల్లో భాగమయ్యారు. అందులో ఒకటి త్రిమూర్తులు కాగా, మరొకటి ప్రేమమ్. వెంకటేశ్ హీరోగా నటించిన త్రిమూర్తులు (1987) మూవీలో నాగార్జున ఒక పాటలో కాసేపు తళుక్కున మెరుస్తారు. అలా.. వెంకీ, నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక చిత్రంగా త్రిమూర్తులు గుర్తుండిపోతుంది. ఇక నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ లో.. చైతూకి తండ్రిగా నాగ్, మేనమామగా వెంకీ వేర్వేరు సీన్స్ లో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది.