English | Telugu
ఏయన్నార్ సినిమాలో నాగ్ అతిథి పాత్ర.. అమెరికన్ ఫిల్మ్ చూసి కాపీ కొట్టారు!
Updated : Aug 29, 2023
కింగ్ అక్కినేని నాగార్జున పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో సందడి చేశారు. వాటిలో కొన్ని చిత్రాలు బాగా క్లిక్ అయ్యాయి కూడా. ఈ క్రమంలోనే.. తన తండ్రి, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఓ సినిమాలోనూ నాగ్ అతిథి పాత్ర పోషించారు. అది కూడా.. 'హీరో నాగార్జున'గానే.
ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ఫిల్మ్ 'ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్' (1965)నిఆధారంగా చేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సంస్థలు 'రావుగారిల్లు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించాయి. తరణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, జయసుధ, రేవతి, మురళీ మోహన్, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, సుత్తి వేలు, బేబి విజయ (రాశి) ముఖ్య పాత్రల్లో నటించగా.. స్పెషల్ రోల్ లో నాగ్ కనిపించారు. 1988 జూన్ 6న విడుదలైన ఈ చిత్రం అక్కినేని అభిమానులను అలరించింది.
(ఆగస్టు 29.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా)