English | Telugu
అత్తగా వాణిశ్రీ అదరగొట్టిన సినిమాలేంటో తెలుసా!
Updated : Aug 3, 2023
తెలుగునాట తిరుగులేని స్టార్ డమ్ చూసిన కథానాయికల్లో కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. 1970ల్లో నటరత్న నందమూరి తారక రామారావు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటశేఖర కృష్ణ, నట భూషణ్ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఇలా అందరు అగ్ర కథానాయకులతోనూ ఘనవిజయాలు అందుకున్నారామె. 1978లో డాక్టర్ కరుణాకరన్ ని పెళ్ళాడాక సినిమాలకు కొన్నాళ్ళపాటు దూరమైన వాణిశ్రీ.. 1989లో రీఎంట్రీ ఇచ్చి పలు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. మరీముఖ్యంగా.. హీరోలకి అత్త పాత్రల్లో వాణిశ్రీ అదరగొట్టారనే చెప్పాలి.
1989 సంక్రాంతికి వచ్చిన సంచలన చిత్రం 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'లో మెగాస్టార్ చిరంజీవికి అత్తగా చాముండేశ్వరీ దేవి పాత్రలో అదరగొట్టారు వాణిశ్రీ. ఆపై విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'బొబ్బిలి రాజా'లోనూ మినిస్టర్ రాజేశ్వరీ దేవిగా అత్త పాత్రలో అలరించారు. అదేవిధంగా కింగ్ నాగార్జున టైటిల్ రోల్ లో తెరకెక్కిన 'అల్లరి అల్లుడు'లో అఖిలాండేశ్వరిగా ఆకట్టుకున్నారు. అలాగే 'కలెక్టర్ గారి అల్లుడు', 'హలో అల్లుడు' సినిమాల్లో సుమన్ కి, 'బొంబాయి ప్రియుడు'లో జేడీ చక్రవర్తికి అత్తగా వాణిశ్రీ అదరహో అనిపించారు.
(ఆగస్టు 3.. వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా)