Read more!

English | Telugu

మీకు తెలుసా: మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ నిర్మాత!

సూపర్ స్టార్ కృష్ణ, మెగా స్టార్ చిరంజీవి ఇద్దరు కూడా ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నటించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్న మగధీరులు. ఎలాంటి పాత్ర అయినా సరే ఆ పాత్రలో అవలీలగా నటించే సత్తా ఆ ఇద్దరి హీరోల సొంతం. చిరంజీవి కంటే ముందే  స్టార్ డం ని సంపాదించిన కృష్ణ చిరంజీవి నటించిన ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడనే విషయం మీకు తెలుసా.. పైగా ఆ మూవీ  అలాంటి ఇలాంటి మూవీ కాదు తెలుగు చిత్ర పరిశ్రమ తీరు తెన్నులనే మార్చివేసిన సినిమా.. మరి ఆ సినిమా  ఏంటో తెలుసుకుందామా..

చిరంజీవి అప్పుడప్పుడే హీరో గా ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు. తనకి ఇంకా పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ రాని పరిస్థితి. సరిగా ఆ టైం లో వచ్చింది ఖైదీ మూవీ. కోదండరామిరెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఆ మూవీ చిరంజీవికి స్టార్ డం ని తీసుకురావడంతో పాటు  చిరంజీవి అంటే ఏమిటో అందరికి తెలిసేలా చేసింది. జెట్ స్పీడ్ వేగంతో చిరంజీవి చేసిన డాన్స్, ఫైట్స్ తెలుగు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసాయి. 

మీరు ఏంటండీ.. చిరంజీవి సినిమాకి కృష్ణ నిర్మాతగా చేసిన సినిమా పేరు చెప్పకుండా  ఖైదీ సినిమా గురించి చెప్తారేంటని అనుకుంటున్నారా.. ఈ  ఖైదీ  సినిమాలోనే మీకు కావలసిన మ్యాటర్ అంతా ఉంది. చిరంజీవి హీరో గా 1983 లో వచ్చిన ఖైదీ మూవీ  1984 లో హిందీలో రీమేక్ అవ్వడం జరిగింది. ఈ హిందీ రీమేక్  ఖైదీ ని  పద్మాలయ స్టూడియో బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ నిర్మించారు. చిరంజీవి క్యారక్టర్ ని జితేంద్ర పోషించగా  తెలుగు లో హీరోయిన్ గా చేసిన మాదవి హిందీ లో కూడా  హీరోయిన్ గాను చేసింది. సుమలత పోషించిన పాత్రని హేమ మాలిని,  రంగనాధ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రని శత్రుఘ్న సిన్హా లు పోషించారు. అలాగే రావు గోపాలరావు పోషించ పాత్రని ఖదీర్ ఖాన్ లు పోషించారు. ఎస్ ఎస్ .రవి చంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ హిందీ ఖైదీ మూవీ  కూడా ఘన విజయం సాధించి సూపర్ స్టార్ కృష్ణ కి కనక వర్షం కురిపించింది.  సో ఇలా కృష్ణ చిరంజీవి నటించిన  ఖైదీ సినిమా కి నిర్మాతగా వ్యవహరించారు. ఇక్కడ అసలు కొసమెరుపు ఏంటంటే రీమేక్ అంటే ఒరిజినల్ సినిమాలోని కథని తీసుకొని కొత్త రకం స్క్రీన్ ప్లే తో నిర్మిస్తారు. కానీ హిందీ  ఖైదీ మాత్రం తెలుగు ఖైదీ కి మక్కి మక్కి కాపీల ఉంటుంది.