Read more!

English | Telugu

ఆ హీరోయిన్‌ అందాలు ఎవరూ చూడకూడదని ఆమె భర్త ఏం చేశాడో తెలుసా?

ప్రపంచంలో రకరకాల పిచ్చి పనులు మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఇలాంటి ఓవరాక్షన్‌ విదేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయితే ఇక చెప్పక్కర్లేదు. అలాంటి ఓ విచిత్రమైన సంఘటన హాలీవుడ్‌లో జరిగింది. ఆమె పేరు హెడీ లామర్‌. అతిలోక సుందరిని తలపించే తన అంద చందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించేది. ఆమె అందాన్ని చూసి ముగ్దుడైన అలెగ్జాండర్‌ మండీ అనే ధనవంతుడు ఆమెను ప్రాధేయ పడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అతని వయసు 33 సంవత్సరాలు. అప్పటికి హెడీ వయసు 19 ఏళ్ళు. 21 సంవత్సరాల వయసులోనే తొలిసారి పెళ్లి చేసుకున్న మండీ సంవత్సరం తిరక్కుండానే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. దాదాపు 12 ఏళ్ళు ఒంటరిగానే ఉన్న మండీని హెడీ అందం కదిలించింది. ఎన్నో సినిమాల్లో అర్థనగ్నంగానూ, నగ్నంగానూ నటించింది హెడీ. ఆమె గ్లామర్‌ని చూసి అందరూ ఆమెను హెడీ గ్లామర్‌ అని పిలిచేవారు. అంతటి అందగత్తె అయిన తన భార్య అందాన్ని మరొకరు చూడకూడదు అనుకున్నాడు. 1933లో ఆమె నటించిన ‘ఎక్స్‌టసీ’ అనే చిత్రంలో హెడీ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఆమె అందాన్ని తెరపై ఆస్వాదించారు అందరూ. అయితే ఇకపై తన భార్య అందాలను ఎవరూ చూడకూడదని డిసైడ్‌ అయిన మండీ ఆ సినిమాకి సంబంధించిన ప్రింట్స్‌ అన్నింటినీ తెప్పించి వాటిని తగలబెట్టేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ ఏ ప్రింట్‌ వచ్చిన దాన్ని ఎంతో డబ్బు చెల్లించి కొని తగలబెట్టేవాడు. 

పిచ్చి ఎప్పటికైనా పరాకాష్టకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఎక్స్‌టసీ’ చిత్రం విడుదలైన సంవత్సరమే హెడీని పెళ్లి చేసుకున్నాడు మండీ. వారి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్ళయిన నాలుగు సంవత్సరాలకి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మరో ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంది హెడీ. ఆమె చివరి పెళ్లి 1963లో జరిగింది. 1965లో తన ఆరో భర్తకు విడాకులిచ్చింది. 2000 సంవత్సరంలో చనిపోయిన హెడీ 1965 తర్వాత మరో పెళ్లి చేసుకోలేదు. హెడీ నుంచి విడిపోయిన తర్వాత మండీ మరో నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అతని ఐదో భార్య 1977లో చనిపోయింది. అదే సంవత్సరం మండీ కూడా చనిపోవడం గమనార్హం.