Read more!

English | Telugu

కమెడియన్‌ అలీ కూతుర్ని అలా చూసి భయంతో వణికిపోయిన చంద్రమోహన్‌!

తెరపై మనం చూసే నటీనటుల నిజ జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలు మనకు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. వారి జీవితాల్లో ఎదురైన కొన్ని అనుభవాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. అలాంటి విచిత్రమైన సంఘటన నటుడు చంద్రమోహన్‌ విషయంలో జరిగింది. ఆమధ్య కమెడియన్‌ అలీ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరైన చంద్రమోహన్‌ ఓ సరదా సంఘటనను షేర్‌ చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్‌ అలీ కూతురికి సంబంధించింది కావడం విశేషం. 

చంద్రమోహన్‌కు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఎవరైనా పిల్లలు కనిపిస్తే వారిని దగ్గరకు పిలిచి చెవి మీద వేలుతో గట్టిగా తట్టి వారు ఏడుస్తుంటే ఆనందించేవారు. అలా ఎంతో మంది పిల్లలను చంద్రమోహన్‌ ఏడిపించేవారు. కమెడియన్‌ అలీ కూడా తన చిన్నతనంలో చంద్రమోహన్‌ బాధితుడే. అతను కనిపిస్తే చాలు రెండు చెవుల మీద చేతులు పెట్టుకొని దూరంగా పరిగెత్తేవాడు అలీ. ఈ విషయంలో చంద్రమోహన్‌ అంటే పిల్లలందరికీ భయమే.

దీన్నే స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు వంశీ ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాలో ఒక క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేశారు. అందులో శుభలేఖ సుధాకర్‌ ఎవరైనా వ్యక్తి వెనక నుంచి అతని చెవిమీద వేలితో గట్టిగా తట్టడం, వాళ్ళు కెవ్వుమని అరవడం జరుగుతుంది. అది ఒక్కోసారి రివర్స్‌ అయి కొందరు వెంటపడి కొట్టడానికి రావడం లాంటి ఇన్సిడెంట్స్‌ని ఆ సినిమాలో చూపించారు. అప్పట్లో ఆ సీన్స్‌ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేసారు. ఇక చంద్రమోహన్‌ విషయానికి వస్తే. తను చేసిన పని రివర్స్‌ కావడంతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. 

ఒక సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ఒక పార్కులో జరుగుతోంది. అలీ అందులో కమెడియన్‌గా యాక్ట్‌ చేస్తున్నాడు. షూటింగ్‌ చూడడానికి వస్తానంటే వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి ఆరేడు సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయితోపాటు అలీ కజిన్‌ కొడుకుని కూడా తీసుకొచ్చాడు. అతనికి ఓ పదేళ్ళు ఉంటాయి. అలీ సెట్‌లో షూటింగ్‌లో ఉండగా బయట పార్కులో కూర్చున్న చంద్రమోహన్‌ ఆ కుర్రాడిని దగ్గరికి పిలిచి ఎప్పటిలాగే చెవి మీద వేలితో గట్టిగా ఒక్కటిచ్చాడు. అంతే.. ఆ అబ్బాయి ఏడుపు మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న అలీ కూతురు దగ్గరలో ఉన్న ఓ బండరాయిని తీసుకొని చంద్రమోహన్‌ దగ్గరికి వచ్చి ‘ఇప్పుడు కొట్టు చూస్తా..’ అంటూ అతని మీదకు వచ్చింది. ఆ రాయి తనమీదకు ఎక్కడ విసిరేస్తుందోనని చంద్రమోహన్‌ భయంతో వణికిపోయాడట. ఆ అమ్మాయిని ఎవరైనా ఆపండ్రా అంటూ కేకలు పెట్టడం మొదలెట్టాడు. రాయిని చేత్తో పట్టుకున్న అలీ కూతురు చంద్రమోహన్‌ వెంటపడిరది. అలా చంద్రమోహన్‌ని పార్కంతా పరిగెత్తించింది. విషయం తెలుసుకున్న అలీ తర్వాత తన కూతురికి సర్ది చెప్పాడు. 

తను చేసిన పని ఇలా రివర్స్‌ అవుతుందని ఊహించని చంద్రమోహన్‌ చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడట. ఆ అమ్మాయి అలా బండరాయి చేత్తో పట్టుకొని వెంటపడుతుంటే భయంతో వణికిపోయానని అలీతో చెప్పాడు. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ భయపడతానని ఆ షోలో మరోసారి దాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రమోహన్‌.