Read more!

English | Telugu

'పద్మ' పురస్కారాల్లో ఏయన్నార్ రేర్ రికార్డ్!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందారు. వాటిలో 'పద్మ' పురస్కారాలకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. పద్మ పురస్కారాలను మూడు విభాగాల్లోనూ ఆయన కైవసం చేసుకున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. 1968లో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆ గౌరవం పొందిన 20 ఏళ్ళ తరువాత అంటే 1988లో 'పద్మభూషణ్'కి ఎంపికయ్యారు. కట్ చేస్తే.. 23 ఏళ్ళ అనంతరం అంటే 2011 సంవత్సరంలో 'పద్మవిభూషణ్' పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అంటే.. 'పద్మ' పురస్కారాలకు సంబంధించి మూడు వేర్వేరు విభాగాల్లోనూ (పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్) ఏయన్నార్ కి గౌరవం దక్కిందన్నమాట. ఒక రకంగా.. ఇది అరుదైన రికార్డు అనే చెప్పాలి. 

(సెప్టెంబర్ 20.. ఏయన్నార్ శతజయంతి సందర్భంగా..)