Read more!

English | Telugu

నేషనల్, నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన ఏయన్నార్ మూవీ.. ఏంటో తెలుసా

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు సినిమాలు.. 'ఉత్తమ చిత్రం' విభాగంలో ఎంపికై పురస్కారాలు అందుకున్నాయి. వాటిలో సింహభాగం విజయం సాధించినవే. 

ఇదిలా ఉంటే, ఏయన్నార్ కథానాయకుడిగా నటించిన ఓ సినిమా.. 'ఉత్తమ చిత్రం' కేటగిరిలో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ సొంతం చేసుకుంది.  ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ పురస్కారంతో పాటు రాష్ట్రప్రభుత్వం తరపున బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నంది అవార్డుని కైవసం చేసుకుంది . అలాగే ఫిల్మ్ ఫేర్ (సౌత్) పురస్కారం సైతం పొందింది. 

ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. 'సుడి గుండాలు'. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి ఏయన్నార్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ఇది. జడ్జ్ చంద్రశేఖరంగా ఏయన్నార్ జీవించిన ఈ సినిమాకి ఆదుర్తి దర్శకత్వం వహించగా.. కళా తపస్వి కె. విశ్వనాథ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. 1968 జూన్ 28న ఈ సినిమా జనం ముందు నిలిచింది. ఈ కల్ట్ క్లాసిక్ లో కింగ్ నాగార్జున బాలనటుడిగా కాసేపు దర్శనమివ్వడం మరో విశేషం. 

(సెప్టెంబర్ 20.. అక్కినేని శతజయంతి సందర్భంగా)