Read more!

English | Telugu

ఒక 'హాట్' సాంగ్‌లో మ‌ల్లిక న‌డుముపై చ‌పాతీలు 'హీట్‌' చేద్దామ‌నుకున్న‌ నిర్మాత‌!

 

మల్లికా షెరావత్ ఒకప్పుడు ఒక నిర్మాత తన వద్దకు వచ్చి పాట సీక్వెన్స్ కోసం 'విచిత్రమైన' కాన్సెప్ట్‌ను చెప్పాడ‌ని వెల్ల‌డించింది. ఆ పాట‌లో భాగంగా తన నడుముపై చపాతీలు పెట్ట‌గా, అవి వేడవుతాయ‌ని చూపించాలనుకున్న‌ట్లు ఆయ‌న తెలిపాడ‌ని ఆమె చెప్పింది. 'ది లవ్ లాఫ్ లైవ్ షో'లో పాల్గొన్న మ‌ల్లిక, పాటను అలా చిత్రీకరించడానికి నిరాకరించాన‌నీ, అయితే దాన్ని ఫ‌న్నీ అయిన ఒరిజిన‌ల్ ఐడియాగా భావించాన‌ని చెప్పింది.

"ఆ ప్రొడ్యూస‌ర్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, 'ఇది చాలా హాట్ సాంగ్‌. నువ్వు హాట్‌గా ఉన్నావ‌ని ఆడియెన్స్‌కు ఎలా తెలుస్తుంది? నువ్వు చాలా హాట్‌. నీ న‌డుముపై చ‌పాతీలు పెడితే అవి వేడ‌వుతాయి' అని చెప్పాడు. అలాంటి ఐడియా నాకు చాలా విచిత్రం అనిపించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. 'వ‌ద్దు, అలాంటివి మ‌నం చేయ‌ట్లేదు' అని ఆయ‌న‌తో అన్నాను. కానీ అది ఒరిజిన‌ల్ ఐడియా అని నాకు తెలుసు" అని చెప్పుకొచ్చింది మ‌ల్లిక‌. 

భార‌త్‌లో ఏది 'హాట్‌'గా ప‌రిగ‌ణించ‌బడుతుందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆమె చెప్పింది. "హాట్‌నెస్ అంటే స్త్రీల‌కు సంబంధించిన‌ద‌నే మ‌న‌దేశంలో అనుకుంటూ ఉంటారు. నాకైతే అది అర్థం కాని విష‌యం. ఇప్పుడైతే ఫ‌ర్వాలేదు కానీ, కెరీర్ స్టార్టింగ్‌లో ఆ ఆలోచ‌న మాత్రం విచిత్రంగానే అనిపించింది" అని తెలిపింది మ‌ల్లిక‌.

'మ‌ర్డ‌ర్' మూవీతో ఒక్క‌సారిగా దేశంలోని సినీ గోయ‌ర్స్‌ను త‌న వైపుకు తిప్పుకుని సెక్స్ బాంబ్‌గా పేరు తెచ్చుకుంది మ‌ల్లికా షెరావ‌త్‌. త‌ను చేసిన పాత్ర‌ల వ‌ల్ల నిజ జీవితంలోనూ త‌ను అలాంటిదాన్న‌నే చాలామంది అనుకున్నార‌నీ, మేల్ యాక్ట‌ర్స్ త‌న ద‌గ్గ‌ర స్వేచ్ఛ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌నీ ఆమె వెల్ల‌డించింది.