English | Telugu
షారుఖ్ ప్రమోషన్లలో దళపతి?
Updated : Aug 19, 2023
షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్. ఈ సినిమాకు సౌత్ డైరక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అట్లీకి, దళపతి విజయ్‌కి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ వల్లనే దళపతి జవాన్‌లో నటించారన్నది టాక్. సెప్టెంబర్ 7న విడుదల కానుంది జవాన్ సినిమా. ఈ సినిమా ప్రమోషన్లు ఆల్రెడీ మొదలయ్యాయి. రకరకాలుగా ఆన్లైన్ ప్రమోషన్లు చేస్తున్నారు. త్వరలోనే చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ చేయనున్నట్టు టాక్. జవాన్ స్పెషల్ ఈవెంట్లో దళపతి విజయ్ పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. షారుఖ్ జవాన్‌లో విజయ్ కాప్ రోల్లో గెస్ట్ గా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈవెంట్ పాల్గొనడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. జవాన్ వేడుకలో విజయ్ పాల్గొని మాట్లాడితే ట్రెండింగ్‌లో షారుఖ్ పేరు కన్నా, విజయ్ పేరే ముందుండాలని ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎలాగూ సెప్టెంబర్‌లో లియో ఈవెంట్‌కి ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే ఉన్నారు దళపతి ఫ్యాన్స్.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విజయ్‌కి రకరకాలుగా కన్వే చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరక్షన్లో విజయ్ నటిస్తున్న లియో అక్టోబర్ 19న విడుదల కానుంది. ఆ లోపే సెప్టెంబర్ 7న జవాన్‌లో చూసుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు దళపతి ఫ్యాన్స్. జవాన్ మూవీని ఎస్ ఆర్ కె రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. గౌరీఖాన్ నిర్మాత. జి.కె.విష్ణు కెమెరా హ్యాండిల్ చేశారు. రుబెన్ ఎడిటర్. టి.ముత్తురాజ్ ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ సేతుపతి, నయనతార, దీపిక పదుకోన్ కీ రోల్స్ చేశారు.