English | Telugu

అప్పుడు సన్నీ లియోన్‌, ఇప్పుడు తమన్నా.. యూత్‌కి పిచ్చెక్కడం ఖాయం!

ఒకప్పుడు సినిమా అంటే ప్రేమకథలకు, ఫ్యామిలీ సెంటిమెంట్లకు, అభ్యుదయ భావాలకు, చక్కని హాస్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేది. కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులు వచ్చాయి. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సినిమాల ట్రెండ్‌ మారుతూ ఉంటుందనేది ఒక సర్వేలో తేలిన విషయం. ఆ ప్రకారం సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సినిమా అనేక రూపాంతరాలు చెందింది. ప్రస్తుతం థ్రిల్లర్స్‌, యాక్షన్‌, హారర్‌, బోల్డ్‌ కంటెంట్‌, సస్పెన్స్‌.. ఇలాంటి విపరీత ధోరణికి సినిమా వెళ్లిపోయింది. యూత్‌ని టార్గెట్‌ చేసుకొని ప్రతి సినిమా నిర్మాణం జరుగుతోందనేది ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది.

హీరోయిన్‌ తమన్నాకి మిల్కీ బ్యూటీ అనే పేరుంది. ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు.. ఇలా కొన్ని సినిమాలలో తన అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం హీరోయిన్‌గా ఆమెకు అవకాశాలు తగ్గాయి. అందుకే జైలర్‌లో ఓ ఐటమ్‌ సాంగ్‌ చేసింది. ఆ పాటలో తమన్నా పెర్‌ఫార్మెన్స్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే లస్ట్‌ స్టోరీస్‌లో బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసింది. ఇప్పుడు వినిపిస్తున్న మాటేమిటంటే.. ‘రాగిణి MMS3’లో తమన్నా నటించబోతోందట. ‘రాగిణి MMS2’లో సన్నీ లియోన్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘బేబీ డాల్‌’ సాంగ్‌లో సన్నీ అందచందాలు చూసి యూత్‌ వెర్రెక్కిపోయింది. తమన్నా తోటి నటీమణులు కాజల్‌, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు బోల్డ్‌ కంటెంట్‌ జోలికి వెళ్ళకుండా డిగ్నిఫైడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. కానీ, తమన్నా ఈ రూట్‌లో వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటికే ‘రాగిణి MMS3’ గురించి నిర్మాత ఏక్తా కపూర్‌తో తమన్నా డిస్కషన్‌ కూడా పూర్తయిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు తమన్నా ఈ ప్రాజెక్ట్‌లో ఓకే అయిందని తెలుస్తోంది. ఇప్పటివరకు చూసిన తమన్నా కాకుండా ఈ సినిమాలో ఓ కొత్త అవతారంలో కనిపించబోతోంది. అయితే సన్నీ లియోన్‌కి వచ్చినంత రీచ్‌ తమన్నాకి వస్తుందా? అనే సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే ‘రాగిణి MMS2’లో సన్నీ ఒక రేంజ్‌లో కనిపిస్తుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా తమన్నాకు వున్న క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్ని మించే స్థాయిలో కనిపించేందుకు ఆమె సిద్ధమవుతోందని తెలుస్తోంది.