English | Telugu

మ‌రొక‌రితో గాఢ‌ ప్రేమ‌లో హృతిక్ మాజీ భార్య సుజానే.. ప్రూఫ్ ఇదే!

హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుజానే ఖాన్‌కు బాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చాలా పాపులారిటీ ఉంది. ఆమె కూడా సినీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చింది క‌దా! ఆమె తండ్రి సంజ‌య్ ఖాన్ 1970, 80ల‌లో పేరుపొందిన యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌. ఇటీవ‌ల న‌టుడు అర్‌స్లాన్ గోనితో ఆమె రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌నే రూమ‌ర్స్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తూ వ‌స్తున్నాయి. ప‌లు పార్టీల్లో ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌డంతో, అంద‌రి దృష్టీ వారిపై ప‌డుతోంది. నిన్న సుజానే బ‌ర్త్‌డే.

ఈ సంద‌ర్భంగా త‌న లేడీ ల‌వ్‌కు "హ్యాపీ బ‌ర్త్‌డే డార్లింగ్" అంటూ ఒక ల‌వ్‌లీ పోస్ట్‌తో గోని విషెస్ తెలియ‌జేయ‌గా, అంత‌కంటే ఇంటెన్స్ పోస్ట్‌తో రిప్లై ఇచ్చింది సుజానే. "Thank you thank you...and thank you for my 'everything' (sic)." అనేది ఆమె ఇచ్చిన రిప్లై. దానికి రెడ్ హార్ట్ ఎమోజీలు కూడా ఆమె జ‌త‌చేసింది. దీంతో మ‌రోసారి వారు హెడ్‌లైన్స్‌లో నిలిచారు. అంతే కాదు, ఇప్పుడు సుజానే బ‌ర్త్‌డే పార్టీకి సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఆ ఇద్ద‌రూ ఎంత స‌న్నిహితమ‌య్యారో ప్ర‌పంచానికి తెలిసింది. ఆ పార్టీలో సుజానే, అర్‌స్లాన్ ఇద్ద‌రూ ఒక‌రి చేతులు ఒక‌రు గ‌ట్టిగా ప‌ట్టుకొని చాలా హ్యాపీగా క‌నిపించారు.

వీడియోలో క్రాప్ టాప్‌, బ్లాక్ స్క‌ర్ట్ ధ‌రించిన సుజానే ముందు బ‌ర్త్‌డే కేక్ ఉంది. దాని చుట్టూ కొంత‌మంది వ్య‌క్తులు క‌నిపిస్తున్నారు. అర్‌స్లాన్ ఆమె ప‌క్క‌నే నిల్చొని ఉన్నాడు. ఒక‌రి చేతిని మ‌రొక‌రు గ‌ట్టిగా ప‌ట్టుకొని, విడ‌దీయ‌లేనంత స‌న్నిహితంగా క‌నిపించారు. పార్టీని సుజానే చాలా ఎంజాయ్ చేసింది. చివ‌ర‌లో ఫ్రెండ్స్ అంద‌రికీ ఆమె ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చింది. చూస్తుంటే.. సుజానే, గోని మ‌ధ్య బంధం ఇంకో స్థాయికి వెళ్లేట్లుగా ఉంద‌ని బాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.

చిన్న‌నాటి స్నేహితులైన హృతిక్ రోష‌న్‌, సుజానే ఖాన్‌.. కాల‌క్ర‌మంలో ప్రేమ‌లోప‌డి 2000 సంవ‌త్స‌ర‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి హృదాన్‌, హ్రెహాన్ అనే ఇద్ద‌రు కొడుకులు పుట్టారు. సంసారంలో క‌ల‌త‌లు చెల‌రేగ‌డంతో 14 సంవ‌త్స‌రాల వైవాహిక బంధానికి స్వ‌స్తిచెప్పి, 2014లో ఆ ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.