English | Telugu

2021లో ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌ మ‌న సినిమా కాదు.. హాలీవుడ్ మూవీ!

ఇండియాలో హాలీవుడ్ ఫిల్మ్ 'స్పైడ‌ర్‌మ్యాన్: నో వే హోమ్‌'కు ఎదుర‌నేది లేకుండా పోయింది. 2021లో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా ఆ మూవీ నిలిచింది. టామ్ హాలండ్ టైటిల్ రోల్ పోషించ‌గా, డిసెంబ‌ర్ 16న విడుద‌లైన ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా కూడా. ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ. 260 కోట్లు వ‌సూలు చేయ‌డం ద్వారా, దేశంలో 2021లో విడుద‌లైన సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన మూవీగా నిలిచింది.

Also read:సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

కొవిడ్ 19 కేసులు పెర‌గ‌క ముందు బాక్సాఫీస్ రిక‌వ‌రీకి 'స్పైడ‌ర్‌మ్యాన్' స‌క్సెస్ పెద్ద ఊపునిచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా థియేట‌ర్ల‌కు కొత్త ఊపిరినిచ్చింది. విడుద‌లైన ద‌గ్గ‌ర్నుంచీ ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేసింది ఆ మూవీ. ప్ర‌పంచ‌వ్యాప్తంగా హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచిన ఆ సినిమా క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో దేశంలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది.

Also read:"ష‌ణ్ముఖ్‌, నేను విడిపోతున్నాం".. దీప్తి సంచ‌ల‌నం! కార‌ణం ఆమేనా?

ఇప్ప‌టివ‌ర‌కూ 'స్పైడ‌ర్‌మ్యాన్: నో వే హోమ్' వ‌సూలు చేసిన మొత్తం రూ. 260 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ (GBOC), రూ. 202 కోట్ల నెట్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ (NBOC). టామ్ హాలండ్‌, జెందాయ జంట‌గా న‌టించిన ఈ సినిమా ఇండియాలో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌లైన హాలీవుడ్ మూవీ. మొత్తం 3264 స్క్రీన్స్‌లో ఈ మూవీ రిలీజైంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.