Read more!

English | Telugu

వామ్మో... సోన‌మ్ అంత అడుగుతుందా?

వామ్మో... ఏంటీ సోన‌మ్ అంత అడుగుతుందా? అని నోరెళ్ల బెడుతున్నాయ‌ట ఓటీటీ సంస్థ‌లు. అయితే అడుగుతున్న‌ది సోన‌మ్ కాదు. ఆమె న‌టించిన బ్లైండ్ మూవీ సంస్థ‌. 2019లో జోయా ఫ్యాక్ట‌ర్ సినిమాలో క‌నిపించారు సోన‌మ్‌. ఆ త‌ర్వాత డెలివ‌రీకి వెళ్లిపోయారు. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో సోన‌మ్ పేరు తెలియ‌నివారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.

డెలివ‌రీ టైమ్‌లోనూ, ఆ త‌ర్వాత కూడా త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు సోన‌మ్‌. ఈ యాటిట్యూడ్ కేవ‌లం ఫ్యాష‌న్ విష‌యంలోనే కాదు, సినిమాల రేట్ల విష‌యంలోనూ క‌నిపిస్తోంద‌ట‌. ఆమె న‌టించిన బ్లైండ్ సినిమాకు 40 కోట్లు అడుగుతున్నార‌ట మేక‌ర్స్. అందుకే కొన‌డానికి ఏ ఓటీటీ ముందుకు రావ‌డం లేద‌ట‌.ముందు బ్లైండ్ మూవీని థియేట‌ర్ల‌లో విడుద‌ల  చేయాల‌నుకున్నార‌ట‌. అయితే, ఓటీటీలో అయితే క‌లెక్ష‌న్ల గోల ఉండ‌దు. పైగా 40 కోట్ల‌కు అమ్మేస్తే, చేతికి ఇన్‌స్టంట్‌గా డ‌బ్బులు వ‌స్తాయ‌ని ప్లాన్ వేసుకున్నార‌ట‌. అయితే వాళ్లు అనుకున్న అమౌంట్ విష‌యంలోనే చిక్కు వ‌చ్చి ప‌డింది. ఈసినిమాను 40 కోట్ల‌కు కొన‌డానికి ఏ ఓటీటీ సంస్థా కూడా ధైర్యం చేయ‌డం లేద‌ట‌. స‌రే పోనీలే అని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేద్దాం అనుకుంటే, డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా ఎవ‌రూ ముందుకు రావ‌ట్లేద‌ట‌. 2020లో సెట్స్ మీద‌కు వెళ్లిన సినిమా ఇది. స్కాట్లాండ్‌లో ఎక్కువ భాగం షూట్ చేశారు. 2021 ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ పూర్తి చేసుకుంది.

2011లో విడుద‌లైన కొరియ‌న్ సినిమాకు రీమేక్ ఇది. సీరియ‌ల్ కిల్ల‌ర్‌ని వెతికి ప‌ట్టుకునే బ్లైండ్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో తెర‌కెక్కించారు.ఇన్నేళ్లుగా నానుతున్న ఈ సినిమాను ఇప్పుడు ఎవ‌రు తీసుకుంటారు? ఎంత ఆఫ‌ర్ చేస్తారో చూడాలంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.