English | Telugu

శిల్పాశెట్టి షాకింగ్ కామెంట్స్.. నా భర్త ఏం చేస్తుండేవాడో తెలియదు!

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో శిల్పాశెట్టిని కూడా సాక్షిగా చేర్చారు ముంబై పోలీసులు. అయితే, తన భర్త ఏం చేస్తుండేవాడో తనకు తెలియదని శిల్పాశెట్టి చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోల కేసులో మొత్తం 1400 పేజీల చార్జ్ షీట్ ను పోలీసులు ఫైల్ చేశారు. ఈ చార్జ్ షీట్ లో శిల్పాశెట్టి స్టేట్మెంట్ ను కూడా పొందుపరిచారు. తాను సినిమాలు, ఇతర వర్క్స్ తో బిజీగా ఉండేదాన్నని.. రాజ్‌ కుంద్రా ఏం చేస్తుండేవాడో తాను ఎప్పుడూ ప‌ట్టించుకోలేద‌ని ఆమె పోలీసుల‌కు తెలిపారు. అంతేకాదు త‌న‌కు హాట్‌ షాట్స్‌, బాలీఫేమ్ యాప్స్ గురించి కూడా తెలియ‌ద‌ని శిల్పాశెట్టి పేర్కొన్నారు.

కాగా పోర్నోగ్రఫీ కేసులో జులై 19న రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాము తీసింది పోర్న్ వీడియోలు కాదని వాదిస్తున్న ఆయన.. ఇప్పటికీ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.