Read more!

English | Telugu

బాలీవుడ్ కి మరో దెబ్బ.. 'షంషేరా' కూడా ఫట్!

బాలీవుడ్ పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతుంది. అసలే ఓ వైపు నార్త్ లోనూ సౌత్ సినిమాల హవా నడుస్తుంటే.. మరోవైపు బాలీవుడ్ సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. తాజాగా 'షంషేరా' రూపంలో బాలీవుడ్ కి మరో బిగ్ షాక్ తగిలింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కి, భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న బాలీవుడ్ సినిమాలు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా ఆ లిస్టులో 'షంషేరా' కూడా చేరింది. రణబీర్ కపూర్ హీరోగా కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'షంషేరా'. రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ జులై 22న విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఈ సినిమా రూ.10.25 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. ఇది ఈ ఏడాది విడుదలైన ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'గంగూబాయి కతియావాడి'(రూ.10.50) కంటే తక్కువ ఓపెనింగ్స్ రాబట్టడం గమనార్హం. ఫుల్ రన్ లో 'షంషేరా' రూ.60-70 కోట్ల లోపే నెట్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని, అదే జరిగితే బాలీవుడ్ ఖాతాలో మరో భారీ ప్లాప్ పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.