Read more!

English | Telugu

ఫ‌ర్జీ కోసం వెయిట్ చేస్తున్న షాహిద్‌

రాజ్ నిడ‌మోరు, కృష్ణ డీకే క‌లిసి తెర‌కెక్కించిన ప్రాజెక్ట్ ఫ‌ర్జీ. దీంతో డిజిట‌ల్ డెబ్యూ ఇస్తున్నారు షాహిద్ క‌పూర్‌. ఫ‌ర్జీ గురించి మాట్లాడుతూ ``ఈ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌నుకునే స‌న్నీ కేర‌క్ట‌ర్‌లో చేశాను. ప్రాజెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. 20 ఏళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉండి, ఇప్పుడు డిజిట‌ల్ డెబ్యూ  చేస్తుంటే చాలా ఉత్సాహంగా, కొత్త‌కొత్త‌గా అనిపిస్తోంది. న‌న్ను నేను డిజిట‌ల్ స్క్రీన్ మీద చూసుకోవ‌డానికి ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నాను. ప్ర‌జ‌లు న‌న్ను ఎలా రిజీవ్ చేసుకుంటారో చూడాల‌ని అనుకుంటున్నాను`` అని అన్నారు షాహిద్‌. ఎనిమిది భాగాల సిరీస్ ఫ‌ర్జీ. సౌత్ స్టార్ విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్రా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

"కమీనీ", "హైదర్", "ఉడ్తా పంజాబ్", "పద్మావత్‌ , "జెర్సీ" వంటి చిత్రాలతో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు షాహిద్‌.వెబ్‌సీరీస్‌ల‌లో రాజ్‌,డీకేకి స్పెష‌ల్ నేమ్ ఉంది. వారిద్ద‌రూ క‌లిసి తెర‌కెక్కించిన ఫ్యామిలీ మేన్ సీరీస్‌కి స్పెష‌ల్ అభిమానులున్నారు. ఫ‌ర్జీ కోసం షాహిద్ క‌పూర్ మాత్ర‌మే కాదు, రాశీఖ‌న్నా, విజ‌య్ సేతుప‌తి కూడా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీమేన్ సీరీస్‌లో ప్రియ‌మ‌ణికి ఎంత మంచి పేరు వ‌చ్చిందో, ఈ సీరీస్‌లో రెజీనాకు కూడా అంతే పేరు వ‌స్తుంద‌ని అంటున్నారు మేక‌ర్స్.