Read more!

English | Telugu

డ్యూయ‌ల్ రోల్‌లో ఛేజింగ్ సీక్వెన్స్ చేయ‌నున్న షారుఖ్‌

సినిమా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌డం, పులి మీద స్వారీ చేయ‌డం ఒక‌టే. ఒక సినిమా స‌క్సెస్ ఇచ్చేసిన త‌ర్వాత రిలాక్స్ అవుతానంటే చెల్ల‌దు ఇండ‌స్ట్రీలో. హిట్ సినిమా నిన్న‌టిది అవుతుంది. రేప‌టి సినిమా సంగ‌తేంట‌ని ఆరా తీస్తుంటారు జ‌నాలు. అందుకే చాలా సార్లు చేసిన ప‌నికి గొప్ప అప్లాజ్ వ‌చ్చినా, ఆస్వాదించే స‌మ‌యం ఉండ‌దు స్టార్ల‌కు. ఇప్పుడు షారుఖ్‌కి కూడా అలాంటి స్పేస్ దొర‌క‌లేదు. ఆయ‌న న‌టించిన ప‌ఠాన్ జ‌న‌వ‌రి 25న విడుద‌లైంది.దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హామ్ న‌టించిన ఆ సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్  చేసేలోపే జ‌వాన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వ‌చ్చింది షారుఖ్‌.

జ‌వాన్‌లో షారుఖ్ డ‌బుల్ యాక్ష‌న్ చేస్తున్నారు. అట్లీ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్లుంటాయి. ఇందులో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఆల్రెడీ 130 రోజుల షూటింగ్ పూర్త‌యింది. ఇంకో 30 రోజులు క‌ష్ట‌ప‌డితే, త‌న పార్టు పూర్తి చేస్తారు షారుఖ్‌. త‌న షూటింగ్ కోసం ముంబైలోనే మంచి లొకేష‌న్ల‌ను చూడ‌మ‌న్నార‌ట షారుఖ్‌. త్వ‌ర‌లోనే ఆ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఒక‌రిని ఒక‌రు త‌రుముతున్న‌ట్టు రెండు కేర‌క్ట‌ర్ల‌లోనూ తానే ఉంటూ ఈ షెడ్యూల్‌ని కంప్లీట్ చేస్తారు కింగ్ ఖాన్‌.

న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తున్న సినిమా ఇది. జూన్ 2న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప‌ఠాన్ వెయ్యి కోట్ల మార్కు ట‌చ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఈ లెక్క‌న జ‌వాన్‌కి ఫిక్స్ అయిన టార్గెట్ వెయ్యి కోట్ల‌న్న‌మాట‌. ప‌ఠాన్‌తో స‌క్సెస్ ఇచ్చి సిద్ధార్థ్ ఆనంద్ సూప‌ర్బ్ అనిపించుకున్నారు. నార్త్‌లో తాను చేస్తున్న ఫ‌స్ట్ ప్రాజెక్ట్ ని స‌క్సెస్ చేసి తీరాల్సిన కంప‌ల్స‌రీ సిట్చువేష‌న్‌లో ఉన్నారు డైర‌క్ట‌ర్ అట్లీ. ఆల్రెడీ షారుఖ్‌తో చెన్నై ఎక్స్ ప్రెస్‌లో స్టెప్పులేసిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు జవాన్‌లోనూ ఆడిపాడ‌టానికి రెడీ అవుతున్నారు.