Read more!

English | Telugu

9 ఏళ్ల‌కే తైక్వాండోలో గోల్డ్ మెడ‌ల్.. షారుక్ చిన్న‌కొడుకు అబ్రామ్ మామూలోడు కాదు!

 

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ త‌న చిన్న‌కొడుకు అబ్రామ్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాడు. ఎందుకంటే ఆదివారం (అక్టోబ‌ర్ 16) అబ్రామ్ తైక్వాండోలో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు! అవును. ముంబైలోని కిర‌ణ్స్ తైక్వాండో ట్రైనింగ్ అకాడ‌మీలో జ‌రిగిన తైక్వాండో ఇంట‌ర్‌క్లాస్ కాంపిటిష‌న్‌లో అబ్రామ్ ఈ ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైన కొన్ని ఫొటోలు, వీడియోల‌లో అబ్రామ్ తైక్వాండోలో చేసిన విన్యాసాల‌ను, ప్ర‌త్య‌ర్ధిపై పైచేయి సాధించిన వైనాన్ని మ‌నం చూడొచ్చు. చివ‌ర‌గా, త‌న ఏజ్ గ్రూప్ పోటీలో ట్రోఫీని గెలుచుకొని, తండ్రి చేతుల మీదుగా ప‌తకాన్ని అందుకున్నాడు.

అంత‌కు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఎంట్ర‌న్స్ ద‌గ్గ‌ర భార్య గౌరీ ఖాన్‌, పిల్ల‌లు ఆర్య‌న్, సుహానా, అబ్రామ్‌తో క‌లిసి క‌నిపించాడు షారుక్‌. త‌మ కుటుంబంలో అంద‌రికంటే చిన్న‌వాడు తైక్వాండో పోటీల్లో పాల్గొంటుంటే, చూడ్డానికి వాళ్లంతా వెళ్లారు. గౌరీ, సుహానా స్ట‌న్నింగ్ లుక్స్‌తో క‌నిపించ‌గా, షారుక్‌, ఆర్య‌న్ అందంగా క‌నిపించారు. అబ్రామ్ తైక్వాండో యూనిఫామ్‌లో ఉన్నాడు.

అదివ‌ర‌కు సెప్టెంబ‌ర్ 19న క‌రాటే క్లాస్‌లో ఉన్న అబ్రామ్ కెమెరా కంటికి చిక్కాడు. క‌రాటే, ఇత‌ర‌ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొందిన అన్న ఆర్య‌న్ బాట‌లోనే అబ్రామ్ కూడా న‌డుస్తున్నాడు. షారుక్‌, గౌరీ దంప‌తుల‌కు 1997లో ఆర్య‌న్‌, 2000లో సుహానా జ‌న్మించారు. ఆ త‌ర్వాత 13 సంవ‌త్స‌రాల‌కు స‌రోగ‌సీ ద్వారా వారికి అబ్రామ్ పుట్టాడు.