English | Telugu

షారుక్ - అట్లీ చిత్రం.. నేప‌థ్యం అదేనా!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కోలీవుడ్ కెప్టెన్ అట్లీ కుమార్ ఓ భారీ బ‌డ్జెట్ మూవీని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార బాలీవుడ్ డెబ్యూగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో
ప్రియ‌మ‌ణి, సాన్యా మ‌ల్హోత్రా, యోగిబాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్. రెహ‌మాన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ నేప‌థ్య సంగీత‌మందించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం పూణెలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఈ సినిమా రివెంజ్ డ్రామా నేప‌థ్యంలో
సాగుతుంద‌ట‌. అంతేకాదు.. దొంగ‌త‌నం చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయ‌ని వినికిడి. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, హిందీతో పాటు త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏకకాలంలో విడుద‌ల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ద్వితీయార్ధంలో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంద‌ని బ‌జ్.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.