Read more!

English | Telugu

`జెర్సీ` హిందీ వెర్ష‌న్ కి కూడా అంతే!

నేచుర‌ల్ స్టార్ నానికి న‌టుడిగా ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చిన చిత్రం `జెర్సీ` (2019). ఇందులో మిడిల్ ఏజ్డ్ క్రికెట‌ర్ గా మెస్మ‌రైజ్ చేశాడు నాని.  గౌత‌మ్ తిన్న‌నూరి రూపొందించిన ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా.. `ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం` (తెలుగు), `ఉత్త‌మ ఎడిట‌ర్` (న‌వీన్ నూలి) విభాగాల్లో రెండు జాతీయ పుర‌స్కారాల‌ను సైతం అందుకుని వార్త‌ల్లో నిలిచింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ అయింది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. దీపావ‌ళికి రావాల్సిన ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ డిసెంబ‌ర్ 31కి వాయిదా ప‌డింది.

కాగా, ఈ చిత్రానికి వారం ముందు మ‌రో క్రికెట్ బేస్డ్ మూవీ రాబోతోంది. ఆ సినిమానే.. `83`. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో నాటి టీమ్ ఇండియా కెప్టెన్ క‌పిల్ దేవ్ గా అల‌రించ‌నున్నాడు ర‌ణ్ వీర్ సింగ్. డిసెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. తెలుగు `జెర్సీ` రిలీజ్ కి  రెండు వారాల ముందు క్రికెట్ నేప‌థ్యంలో సాగే మ‌రో చిత్రం విడుద‌లైంది. అదే.. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన `మ‌జిలీ`. `జెర్సీ`తో పోలిస్తే `మ‌జిలీ`నే క‌మ‌ర్షియ‌ల్ గా మెప్పించ‌డం గ‌మ‌నార్హం. మొత్త‌మ్మీద‌. తెలుగు వెర్ష‌న్ త‌ర‌హాలోనే హిందీ వెర్ష‌న్ కి కూడా మ‌రో క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ పోటీగా నిలుస్తుండ‌డం యాదృచ్ఛిక‌మే అయినా.. అంతిమంగా ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!