Read more!

English | Telugu

పెళ్లి గురించి జోక్ చేసిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌!

బాలీవుడ్‌లో చ‌ట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగిన జంట‌ల‌న్నీ ఒక గూటికి చేరుకుంటున్నాయి. ఆ మ‌ధ్య ఆలియా, రీసెంట్‌గా కియారా న‌చ్చిన వారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇప్పుడు బీటౌన్ దృష్టి ర‌కుల్ ప్రీత్‌సింగ్ మీద ప‌డింది. జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ ప్రేమ‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఎప్పుడో ప్ర‌క‌టించారు. వీలైన‌ప్పుడ‌ల్లా సిటీలో జాకీతో క‌లిసే క‌నిపిస్తున్నారు. లేకుంటే పార్టీల్లోనైనా అప్పియ‌రెన్స్ ఇస్తున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో వీరిద్ద‌రి పెళ్లి అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీని గురించి ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ని అడిగితే `అరే అవునా? ఎలాంటి వివాహం అది` అని చ‌మ‌త్క‌రించారు. మీరెప్పుడైనా మీ పేరును గూగుల్ చేసి చూసుకున్నారా? అని అడిగితే ``నా పేరును గూగుల్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. గూగుల్ అల‌ర్ట్ లో నా పేరు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్ర‌తి వారం నా గురించి ఎవ‌రో ఒక‌రు, ఏదో ఒక‌టి రాస్తూనే ఉంటారు. నేను గూగుల్‌లో ఫుడ్‌, కేల‌రీస్‌, హెల్త్ గురించి మాత్ర‌మే సెర్చ్ చేస్తాను. మిగిలిన వాటిని అస‌లు ప‌ట్టించుకోను`` అని అన్నారు ర‌కుల్‌.

ప్రేమ గురించి ఓపెన్‌గా మాట్లాడ‌టం త‌న‌కు ఇష్ట‌మేనని అన్నారు ర‌కుల్‌. ``ఒక రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ప్పుడు దాన్ని దాచిపెట్ట‌డం ఎందుకు? ఏమీ లేదంటూ దాక్కుని తిర‌గ‌డం ఎందుకు?  నాకూ, జాకీకి ఒక‌రి మీద ఒక‌రికి సంపూర్ణ‌మైన న‌మ్మ‌కం ఉంది. ఇష్టం ఉంది. ప్రేమ ఉంది. ఒక‌రి ప‌ని మీద ఒక‌రికి గౌర‌వం ఉంది. ఎవ‌రి ప‌నిమీద వారికి శ్ర‌ద్ధ ఉంది. క‌లిసి కాసేపు క‌బుర్లు చెప్పుకోవ‌డానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నాం. అలాంట‌ప్పుడు వారేమ‌నుకుంటారో, వీరేమ‌నుకుంటారో అని మ‌న‌సును పాడుచేసుకుని తిర‌గ‌డ‌మెందుకు? అందుకే ప్ర‌పంచానికి మేం ప్రేమికుల‌మ‌ని ఓపెన్‌గా చెప్పేశాం`` అని అన్నారు.ఛ‌త్రీవాలీ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. బ‌డేమియా చోటేమియా సినిమా నిర్మాణ ప‌నుల్లో ఉన్నారు జాకీ. కృతిస‌న‌న్‌, టైగ‌ర్‌ష్రాఫ్ న‌టించిన గ‌ణ్‌ప‌త్‌కి కూడా అత‌నే నిర్మాత‌.

నిర్మాత‌గా, న‌టిగా క‌లిసిన‌ప్పుడు మీరేం మాట్లాడుకుంటారు అని అడిగితే ``ష్‌.. అది స‌స్పెన్స్`` అంటూ స‌ర‌దాగా న‌వ్వేశారు ర‌కుల్‌. రీసెంట్‌గా ల‌క్ష్మీ మంచు కోసం ర‌కుల్ అండ్ జాకీ స్టేజ్ మీద క‌లిసి క‌నిపించారు.