Read more!

English | Telugu

ఆదిల్ న‌న్ను పెళ్లాడితే, అత‌ని చెల్లెల్ని ఎవ‌రూ పెళ్లి చేసుకోరంట‌!

 

కొన్ని నెల‌లుగా బిజినెస్‌మేన్ ఆదిల్ ఖాన్‌తో డేటింగ్ చేస్తోన్న బాలీవుడ్ ఐట‌మ్ గాళ్ రాఖీ సావంత్‌, త‌న వ‌ల్ల అత‌ను సామాజిక ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నాడ‌ని వెల్ల‌డించింది. గ‌తంలో ఆదిల్ కుటుంబం త‌మ ప్రేమ‌ను అంగీక‌రించ‌డం లేద‌ని చెప్పిన ఆమె, ఇప్పుడు త‌న వ‌ల్ల అత‌ని చెల్లెలి పెళ్లికి ఆటంకాలు క‌లుగుతున్నాయ‌ని చెప్పింది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని చెప్పి బాధ‌ప‌డింది రాఖీ. త‌న‌ను పెళ్లి చేసుకుంటే అత‌ని చెల్లిని పెళ్లి చేసుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రార‌ని కూడా ఆదిల్ చెప్పిన‌ట్లు వెల్ల‌డించిందామె.

"నేనొక విష‌యం చెప్పాల‌నుకుంటున్నా. బాలీవుడ్‌లో చాలామంది ముస్లింలు ఉన్నారు. వాళ్ల‌కు పెళ్లిళ్లు కావ‌ట్లేదా? వాళ్లు ఎక్స్‌పోజ్ చేయ‌ట్లేదా? వాళ్లు ఐట‌మ్ సాంగ్స్ చేయ‌ట్లేదా? నేనొక భిన్న‌మైన బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చాను. కానీ మేం రేపు పెళ్లి చేసుకున్న‌ట్లయితే, ఆదిల్‌ ఫ్యామిలీపై నా ఉనికి ప్ర‌భావం చూప‌దు క‌దా? ఉదాహ‌ర‌ణ‌కు అత‌ని చెల్లెలికి పెళ్లి కావాలి. కొంత‌మంది, 'నువ్వు రాఖీని భార్య‌గా తీసుకొస్తే, నీ చెల్లిని ఎవ‌రు పెళ్లి చేసుకుంటారు?' అంటున్నారంట‌. ఏంటిది?  నేనేమైనా టెర్ర‌రిస్టునా, నేనెందుకు పెళ్లి చేసుకోకూడ‌దు?  నావ‌ల్ల అత‌ని చెల్లికి మంచి సంబంధాలు ఎందుకు రావు?" అని ప్ర‌శ్నించింది రాఖీ.

ఈ ఏడాది మే నెల‌లో ఆదిల్‌తో త‌న రిలేష‌న్‌షిప్ గురించి బ‌య‌ట‌పెట్టిన‌ రాఖీ, అత‌ను త‌న‌కొక BMW కారును గిఫ్ట‌గా ఇచ్చాడ‌ని కూడా చెప్పింది. త‌ను మూవీ, టీవీ ఇండ‌స్ట్రీకి చెందిన గ్లామ‌ర‌స్ ప‌ర్స‌న్‌ను కాబ‌ట్టి, త‌మ రిలేష‌న్‌షిప్‌ను ఆదిల్ కుటుంబం ఒప్పుకోవ‌ట్లేద‌ని ఇదివ‌ర‌కు తెలిపింది. "నేను డ్ర‌స్ చేసుకొనే తీరు వాళ్ల‌కు న‌చ్చ‌దు. అవ‌స‌ర‌మైతే న‌న్ను నేను మార్చుకోవ‌డానికి సిద్ధ‌మే. అయితే అత‌ని ఫ్యామిలీ వైపు నుంచి ఎవ‌రూ న‌న్ను మార‌మ‌ని ఫోర్స్ చెయ్య‌లేదు. అత‌ను అన్నివైపుల నుంచీ టార్చ‌ర్ అనుభ‌విస్తున్నాడు. నాకు భ‌య‌మేస్తోంది. ఎంతో క‌ష్టంమీద న‌న్నొక‌రు ప్రేమించారు. అత‌ని ఖాన్‌దాన్ న‌న్ను ఒప్పుకుంటుంద‌ని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చింది రాఖీ.

బిగ్ బాస్ 15లో త‌న భ‌ర్త‌గా ప‌రిచ‌యం చేసిన రితేశ్ నుంచి విడిపోయిన త‌ర్వాత నుంచీ ఆదిల్‌తో డేటింగ్ చేస్తూ వ‌స్తోంది రాఖీ. రితేశ్ నుంచి విడాకుల కోసం ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకుంది. అయితే త‌ర్వాత రితేశ్ మొద‌టి భార్య అత‌నిపై కేసు పెట్ట‌డంతో, రితేశ్‌కు విడాకుల ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌నీ, అత‌నితో పెళ్లి చెల్ల‌ద‌నీ కోర్టు తెలియ‌జేసింది.