Read more!

English | Telugu

'కేజీఎఫ్' లైఫ్‌టైమ్ క‌లెక్ష‌న్ల‌ను 13 రోజుల్లో దాటేసిన 'పుష్ప‌'!


అల్లు అర్జున్ హీరోగా న‌టించిన 'పుష్ప' హిందీ వెర్ష‌న్ నార్త్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హిందీ స్ట్ర‌యిట్ ఫిల్మ్ '83'తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'స్పైడ‌ర్‌మ్యాన్‌'ను మించి క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతోంది. డిసెంబ‌ర్ 17న విడుద‌లైన‌ హిందీ 'పుష్ప' ఇప్ప‌టిదాకా (13 రోజుల్లో) దేశంలో రూ. 45.50 కోట్ల నెట్‌ను సాధించి, అంద‌రి అంచ‌నాల‌నూ త‌ల‌కిందులు చేసేసింది. స‌రైన ప‌బ్లిసిటీ లేకుండా ఈ రేంజ్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూలు చేయ‌డం ఏ ర‌కంగా చూసినా విశేషంగా చెప్తున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.

Also read: హిందీలో 'రోబో', 'క‌బాలి'ని దాటేసిన 'పుష్ప‌'!

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్ట‌డీగా క‌లెక్ష‌న్లు సాధిస్తోన్న 'పుష్ప', టాప్ 10 హిందీ డ‌బ్బింగ్ మూవీస్ చార్ట్‌లో ఇప్పుడు 5వ‌ స్థానం సంపాదించడం! ఈ క్ర‌మంలో 'కేజీఎఫ్: చాప్ట‌ర్ 1' సినిమాను 6వ స్థానానికి నెట్టేసింది. కేవ‌లం 13 రోజుల్లోనే 'కేజీఎఫ్' లైఫ్‌టైమ్ క‌లెక్ష‌న్ల‌ను దాట‌డం 'పుష్ప' మేనియాకు నిద‌ర్శ‌నం. ఇంత‌దాకా బ‌న్నీ న‌టించిన సినిమాల హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్లు యూట్యూబ్‌లో దుమ్మురేప‌డం చూశాం, ఇప్పుడు తొలిసారి హిందీ ఏరియాల థియేట‌ర్ల‌నూ అల్లు అర్జున్ ఏలేస్తున్నాడు. హిందీ డ‌బ్బింగ్ సినిమాల విష‌యంలో ఇప్పుడు 'బాహుబ‌లి 1' త‌ర్వాత ప్లేస్ 'పుష్ప‌'దే!

టాప్ 10 హిందీ డ‌బ్బింగ్ మూవీస్‌:

బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్ - రూ. 510.99 కోట్లు
2.0 - రూ. 189.55 కోట్లు
సాహో - రూ. 142.95 కోట్లు
బాహుబ‌లి: ద బిగినింగ్ - రూ. 118.70 కోట్లు
పుష్ప: ది రైజ్ - రూ. 45.50 కోట్లు
కేజీఎఫ్: చాప్ట‌ర్ 1 - రూ. 44.09 కోట్లు
కబాలి - రూ. 28 కోట్లు
రోబో - రూ. 23.84 కోట్లు
కాల క‌రికాల‌న్ - రూ. 10.38 కోట్లు
సైరా.. న‌ర‌సింహారెడ్డి - రూ. 7.93 కోట్లు