English | Telugu

నిక్ జోనాస్‌తో పెళ్లికి ముందు ఇండ‌స్ట్రీని షాక్‌కు గురిచేసిన ప్రియాంకా చోప్రా ల‌వ్‌ ఎఫైర్స్

గ్లోబ‌ల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్య‌మైంది కాదు. ఇంట‌ర్నేష‌న‌ల్‌గా ఆమెకు భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. అమెరిక‌న్ ర్యాప్ సింగ‌ర్‌, యాక్ట‌ర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకోక ముందు ప్రియాంక ప‌లువురు న‌టుల‌తో ప్రేమ‌లో ప‌డింది, వారితో డేటింగ్ చేసింది. ఆమె పేరు ఎవ‌రెవ‌రితో క‌లిసి వినిపించిందో ఓసారి చూద్దాం...

అసీమ్ మ‌ర్చంట్‌


మోడ‌లింగ్ చేసే మొద‌ట్లో తోటి మోడ‌ల్ అసీమ్ మ‌ర్చంట్‌తో డేటింగ్ చేసింది ప్రియాంక‌. అయితే బాలీవుడ్‌లో ఎంట‌ర‌య్యాక అత‌డిని వ‌దిలేసింది. అసీమ్‌తో గొడ‌వ‌ల కార‌ణంగా ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కూడా చేసింద‌ని అప్ప‌ట్లో వ‌దంతులు వ‌చ్చాయి.

హ‌ర్మాన్ బ‌వేజా


'ల‌వ్ స్టోరీ 2050'లో ప్రియాంక‌, హ‌ర్మాన్ బ‌వేజా జంట‌గా న‌టించారు. ప్రేమ‌లో ప‌డిన ఆ ఇద్ద‌రూ ఐదేళ్ల పాటు త‌మ బంధాన్ని కొన‌సాగించార‌నీ, అయితే త‌మ సినిమా ఫెయిల‌య్యాక వారు విడిపోయార‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

షాహిద్ క‌పూర్‌


ఒక‌రోజు ఇన్‌క‌మ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్లు ప్రియాంక ఇంటిని శోధించ‌డానికి పొద్దున్నే వెళ్తే, డోర్ ఓపెన్ చేసింది ఆమె కాదు, షాహిద్ క‌పూర్‌. అప్పుడ‌త‌ను నైట్ సూట్‌లో ఉన్నాడు. దీన్ని బ‌ట్టి ఆ ఇద్ద‌రి బంధం ఎంత‌దాకా వెళ్లిందో ఊహించుకోవ‌చ్చు.

అక్ష‌య్ కుమార్‌


ప్రియాంక‌, అక్ష‌య్‌కుమార్ క‌లిసి ప‌లు హిట్ సినిమాల్లో న‌టించారు. వారి ఆన్‌-స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను బాగా అల‌రించింది. ఆ ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నారంటూ మీడియా కోడై కూయ‌డంతో, ప్రియాంక‌తో క‌లిసి ప‌నిచేయ‌కుండా అక్ష‌య్‌ను క‌ట్ట‌డి చేసింది అత‌ని భార్య ట్వింకిల్ ఖ‌న్నా.

షారుఖ్ ఖాన్‌


ప్రియాంక, షారుఖ్ ఖాన్ క‌లిసి న‌టించేట‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్యా స‌న్నిహిత‌త్వం పెరిగింది. షారుఖ్ ఆమెను విడిచిపెట్ట‌లేని స్థితికి వ‌చ్చాడ‌ని బాలీవుడ్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీంతో సీన్‌లోకి ట్వింకిల్ ఖ‌న్నా త‌ర‌హాలోనే షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఎంట‌రై ప్రియాంక‌తో మ‌ళ్లీ షారుఖ్ ప‌నిచేయ‌కుండా అడ్డుకుంది.

టామ్ హిడెల్‌స్ట‌న్‌


ప్రియాంక హాలీవుడ్‌లోకి ఎంట‌ర‌య్యాక ఒక‌సారి జ‌రిగిన ఎమ్మీ అవార్డుల ఉత్స‌వం త‌ర్వాతి పార్టీలో 'లోకి' ఫేమ్ టామ్ హిడెల్‌స్ట‌న్ బ‌హిరంగంగా ప్రియాంక‌తో స‌న్నిహితంగా మెలిగాడు. ఇద్ద‌రూ ఒక‌రి చేతులు ఒక‌రు ప‌ట్టుకొని, కావ‌లించుకుంటూ అంద‌రి దృష్టిలో ప‌డ్డారు.

నిక్ జోనాస్‌


అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌తో క‌లిసి 'మెట్ గ‌లా 2018'లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక‌. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఆ ఇద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. వాటిని నిజం చేస్తూ ఇద్ద‌రూ అదే ఏడాది డిసెంబ‌ర్ 1న వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు.