English | Telugu
షారుఖ్‌కి డ్యాన్స్ నేర్పించిన ప్రియమణి..!
Updated : Sep 12, 2023
షారుఖ్ జవాన్ సక్సెస్, జవాన్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత మందిని అట్రాక్ట్ చేస్తున్నాయో, అంతకన్నా ఎక్కువగానే ఈ సినిమా పరంగా మరో విషయం అట్రాక్ట్ చేస్తోంది. ``ఐదారుగురు అమ్మాయిలు, వాళ్ల మధ్యలో మీరు... ఇలాంటి ఊహ రాగానే నా భార్య ప్రియ తెగ సంబరపడిపోయింది. షారుఖ్‌కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇది అని నన్ను భుజం తట్టి ప్రోత్సహించింది`` అని షారుఖ్ ఖాన్‌కి ఫస్ట్ టైమ్ కథ చెప్పడానికి ముందు... ఈ విషయాన్నే చెప్పారట అట్లీ. జవాన్ సినిమాలో షారుఖ్ చుట్టూ ఉన్న లేడీస్‌లో ప్రియమణిది స్పెషల్ ప్లేస్. ఈ సినిమాలో జిందా సాంగ్‌లో కూడా స్టెప్పులేశారు ప్రియమణి. ఆ సాంగ్ గురించి, షారుఖ్‌తో తనకున్న అసోసియేషన్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు ప్రియమణి.
ఆమె మాట్లాడుతూ ``జిందా సాంగ్ చేసేటప్పుడు సెట్లో నన్ను షారుఖ్ సార్‌కి వెనుక నిలుచోబెట్టారు. ఆయన తిరిగి నా వైపు చూసి `ఇక్కడేం చేస్తున్నావ్` అన్నారు. `ఏమో సార్. నన్ను ఇక్కడే ఉండమన్నారు` అని చెప్పాను. ఆయన వెంటనే నా భుజం మీద చెయ్యి వేసి ముందుకు లాక్కొచ్చి తన పక్కన నిలుచోబెట్టారు. అట్లీని, డ్యాన్స్ మాస్టర్‌ని పిలిచారు. `ఇప్పటిదాకా ఏం స్టెప్ కంపోజ్ చేశారో నాకు తెలియదు. కానీ, ఇప్పుడు ఇలా స్టెప్పులు వేయించండి. నేను చెన్నై ఎక్స్ ప్రెస్ టైమ్ నుంచి ప్రియమణిని చూసి డ్యాన్సులు వేస్తున్నా. అవి తప్పయినా నాకేం ఫర్వాలేదు. తను ఏ స్టెప్ వేస్తే, అదే నాకు స్టెప్` అని అన్నారు. అంతా విని అక్కడున్నవాళ్లందరూ అవాక్కయి చూశారు. అసలు షారుఖ్‌లో ఏమార్పూ లేదు. చెన్నై ఎక్స్ ప్రెస్ సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే, అదే ఆప్యాయతతో ఉన్నారు. నా భర్త తర్వాత నేను అంతగా ఇష్టపడేది షారుఖ్ సార్‌నే`` అని అన్నారు. ప్రస్తుతం హిందీలో మైదాన్‌లోనూ నటిస్తున్నారు ప్రియమణి. అడపాదడపా ఆమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్టులన్నీ హిట్ కావడంతో నార్త్ లోనూ ప్రియమణికి మంచి అప్లాజ్ అందుతోంది.