English | Telugu
కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంటున్న ఆలియాభట్
Updated : Sep 12, 2023
ఆలియా భట్ తన రాహా కపూర్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రాహా కపూర్ ఫేస్‌ని ఇప్పటిదాకా సోషల్ మీడియాలో చూపించనేలేదు ఆలియాభట్. అంతలోనే ఆమె మేకప్ వేసుకుంటారనే విషయం మీద న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని రివీల్ చేసింది కూడా అక్షరాలా రాహా పెద్దమ్మ పూజా భట్. పూజా భట్ బిగ్ బాస్ ఓటీటీ2లో పార్టిసిపేట్ చేశారు. పూజా భట్ మాట్లాడుతూ ``మా భట్ ఫ్యామిలీలో నెక్స్ట్ స్టార్ రాహా కపూర్. నేను మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ నటిగా ప్రూవ్ చేసుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్లకు మా ఆలియా భట్ స్టార్ అయింది. తనను బీట్ చేసేవాళ్లే లేరిప్పుడు. మా రాహా పాప కూడా చాలా అందంగా ఉంది. మా భట్ ఫ్యామిలీలో నెక్స్ట్ స్టార్ తానే. ఇంకో 20 ఏళ్లకు మా లెగసీని కంటిన్యూ చేస్తుంది మా రాహా. తనని చూసిన ప్రతిసారీ నేను అదే అనుకుంటాను`` అని అన్నారు.
ఓ మ్యాగజైన్ కవర్ కోసం పూజా భట్ తన తండ్రి మహేష్ భట్ పెదవులను ముద్దాడారు. దీనికి సంబంధించి కూడా పూజా భట్ వివరణ ఇచ్చారు. ``తండ్రీ కూతుళ్ల అనుబంధానికి పేరు పెట్టడానికి లేదు. కూతురు ఎంత పెద్దదైనా తన తండ్రికి చిన్న పాపే. ఈ విషయం కూతుళ్లున్నవారికి బాగా అర్థమవుతుందని నాతో షారుఖ్ కూడా ఓ సారి అన్నారు. నేను మా నాన్నను ప్రేమతోనే ముద్దాడాను. ఈ విషయాన్ని అర్థం చేసుకునేవారు బాగా అర్థం చేసుకుంటారు. చేసుకోలేనివారికి నేను ఎంత చెప్పినా వృథా అవుతుంది`` అని అన్నారు. తన బిగ్‌బాస్‌ని చెల్లెలు ఆలియా చూసేదని, చాలా సలహాలు చెప్పేదని, పలు మార్లు తన తండ్రి, ఆలియా ఇద్దరూ తన బిగ్‌బాస్ అప్పియరెన్స్ గురించి మాట్లాడుకునేవారని అన్నారు పూజా భట్.