Read more!

English | Telugu

పఠాన్ కు జేజేలు పలుకుతున్న ప్రేక్షకులు!

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కు సరైన సక్సెస్ పడి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. కరోనా మొదలు అయినప్పటినుండి బాలీవుడ్ సినిమాలు అంటే స్వయంగా ఉత్తరాదిన చిన్నచూపు మొదలయింది. క‌రోనా భ‌యం వ‌ల్ల ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదా? అంటే అది నిజం కాదు. ఎందుకంటే వారు సౌత్ సినిమాలకు థియేటర్‌లో పెద్ద క్యూ కడుతున్నారు. కానీ హిందీ సినిమాలను మాత్రం పట్టించుకోవడం లేదు. చాలా కాలం తర్వాత హిందీ సినిమా కోసం ఆడియ‌న్స్ క్యూ  కడుతున్నారు. అదే బాలీవుడ్ బాద్షా షారుక్ నటించిన పఠాన్ చిత్రం కోసం. దీనికి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌. ఇలా జనాలను క్యూలో నిలబెట్టిన ఘనత షారుఖ్ కంటే సిద్ధార్థ్‌ ఆనంద్ కే  ఎక్కువగా దక్కుతుంది. ఇది విశ్లేషకుల అభిప్రాయం. 

సౌత్ యాక్షన్ సినిమాలకు, ఊర‌మాస్ యాక్షన్ సన్నివేశాలకు అలవాటు పడ్డ హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను, హీరో ఎలివేషన్ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఈ సినిమా ప‌క్కా  సౌత్ మాస్ మసాలా యాక్షన్ సినిమా అన్నట్టుగా పట్టాలెక్కింద‌నే చెప్పాలి. ముఖ్యంగా హీరోను యాక్షన్స్ సన్నివేశాలలో చూపించిన తీరు, అలాగే సల్మాన్ ఖాన్ ఇంట్రడక్షన్ ఇంకా ఇద్దరు హీరోల మధ్య జరిగే సరదా సన్నివేశాలు ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేవిధంగా ఉన్నాయి. షారుక్ సల్మాన్ లను వెండితెరపై చూసి మురిసిపోయేలా దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్ వాటిని తీర్చిదిద్దారు.

సల్మాన్ ఖాన్ ఉన్నంత సమయం కూడా ప్రేక్షకులు ఓ ఫీల్ లో  తేలిపోయేలా సన్నివేశాలను రూపొందించారు. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు ఇలాంటి మాస్ సన్నివేశాలను హిందీ ప్రేక్షకులు  కోరుకుంటున్నారు అని ఈ చిత్రం విజ‌యంతో పూర్తిగా అర్ద‌మైపోయింది. సినిమా కథ విషయంలో పెద్దగా చెప్పుకోవడానికి లేదుగానీ ఎలివేషన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో రావాలని నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కోరుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.