English | Telugu

యూఎస్ లో 'ఆర్ఆర్ఆర్'ని దాటేసిన 'పఠాన్'

షారుఖ్ ఖాన్ హీరోగా న‌టించిన సినిమా ప‌ఠాన్‌. దీపిక ప‌దుకోన్ నాయిక‌గా న‌టించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌లైంది ప‌ఠాన్‌. విడుద‌లైన షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా స‌త్తా చాటుతోంది. హ‌య్య‌స్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉంది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ట్రిపుల్ ఆర్ యుఎస్ క‌లెక్ష‌న్ల‌ను మంగ‌ళ‌వారం దాటేసింది.

సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కించిన స్పై యాక్ష‌న్ సినిమా ఇది. దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హామ్ రోల్స్ కి చాలా మంచి పేరు వ‌చ్చింది. బాక్సాఫీస్ డేటా ప్ర‌కారం, ఈ సినిమాకు సోమ‌వారం దాకా వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ 849 కోట్లు. ఇండియా గ్రాస్ 525.80 కోట్లు. ఓవ‌ర్సీస్ 323.20 కోట్లు. నార్త్ అమెరికాలో 14.4 మిలియ‌న్ యూఎస్ డాల‌ర్లు వ‌చ్చాయి. అక్క‌డ ఆర్‌ఆర్‌ఆర్‌కి 14.3 మిలియ‌న్ యుఎస్‌డీలు క‌లెక్ట్ అయ్యాయి. బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌కి ఆల్రెడీ 20 మిలియ‌న్ల యుఎస్ డాల‌ర్ల మార్క్ ఉంది.

ఆస్ట్రేలియాలో 4.5 మిలియ‌న్లు క‌లెక్ట్ అయ్యాయి. ఎమిరేట్స్ లోనూ, గ‌ల్ప్ కంట్రీస్‌లోనూ 11.41 మిలియ‌న్ల యుఎస్‌డీలు క‌లెక్ట్ అయ్యాయి. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లోనూ ప‌ఠాన్ హ‌య్య‌స్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కు ముందు ఆ పేరు ధూమ్‌3కి ఉండేది. ప‌ద్మావ‌త్‌ని క్రాస్ చేసి న్యూజిల్యాండ్‌లోనూ రికార్డు సెట్ చేసింది.

ఇండియాలో ప‌ఠాన్‌కి సోమ‌వారం నుంచి టిక్కెట్ రేట్లు త‌గ్గించారు. సెకండ్ ఫ్రైడేకి ఎంత క్రేజ్ ఉందో, సోమ‌వారానికి కూడా ప‌ఠాన్ విష‌యంలో సేమ్ క్రేజ్ క‌నిపించింది.

ఇదే జోరుతో ఈ ఏడాది వ‌రుస‌గా మ‌రో రెండు సినిమాల‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు షారుఖ్ ఖాన్‌.