English | Telugu

గాయాల‌తో హాస్పిట‌ల్ పాలైన ప్రియాంకా చోప్రా భ‌ర్త‌!

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంకా చోప్రా భ‌ర్త, సింగ‌ర్ నిక్ జోనాస్ గాయాల‌తో హాస్పిట‌ల్ పాల‌య్యాడు. త‌ను ప‌నిచేస్తున్న ఒక టెలివిజ‌న్ రియాలిటీ షో సెట్స్‌పై అత‌నికి గాయాల‌య్యాయ‌ని స‌మాచారం. అత‌నికైన గాయం తీవ్ర‌త తెలియ‌రాలేదు. గాయ‌ప‌డిన వెంట‌నే అత‌డిని అంబులెన్స్‌లో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అమెరిక‌న్ కాలమాన ప్ర‌కారం శ‌నివారం గాయాల‌వ‌గా, ఆదివారం అత‌ను డిశ్చార్జ‌యి ఇంటికి తిరిగొచ్చాడు. సోమ‌వారం నుంచి త‌ను కోచ్‌గా ప‌నిచేస్తున్న 'ద వాయిస్' రియాలిటీ షో షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు.

ప్ర‌స్తుతం నిక్ లాస్ ఏంజెల్స్‌లో ఉండ‌గా, ప్రియాంక లండ‌న్‌లో ఉంది. ప‌లు ప్రాజెక్టుల కార‌ణంగా ఆమె 2020 చివ‌రి నుంచి అక్క‌డే ఉంది. నిక్ 'ద వాయిస్' షోకు ప‌నిచేస్తూ, త‌న 'స్పేస్‌మ్యాన్' ఆల్బ‌మ్‌ను లాంచ్ చేశాడు.

కాగా 28 సంవ‌త్స‌రాల నిక్ టైప్ 1 డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని మూడేళ్ల క్రిత‌మే అత‌ను వెల్ల‌డించాడు. త‌న‌కు ప‌న్నెండేళ్ల వ‌య‌సులోనే ఆ వ్యాధి ఉన్న‌ట్లు గుర్తించార‌ని అత‌ను తెలిపాడు. అయితే వ‌ర్క‌వుట్స్ ద్వారా, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ద్వారా దాన్ని కంట్రోల్‌లో ఉంచ‌గ‌లుగుతున్నాన‌ని కూడా నిక్ చెప్పాడు.

ఇటీవ‌ల ప్రియాంక‌, నిక్ క‌లిసి ఇండియాలో కొవిడ్‌-19 రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 1 మిలియ‌న్ డాల‌ర్లు (7.32 కోట్ల రూపాయ‌లు) సేక‌రించారు. మొద‌ట అనుకున్న ల‌క్ష్యాన్ని అధిగ‌మించాక‌, త‌మ టార్గెట్ అమౌంట్‌ను 3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు వారు పెంచారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.