English | Telugu
కరోనా దెబ్బ.. వెంటిలేటర్ మీద ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్!
Updated : Apr 20, 2021
సెకండ్ వేవ్ కొవిడ్ దేశవ్యాప్తంగా జనాన్ని భయకంపితుల్ని చేస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే ఇది మరింత డెడ్‌లీగా కనిపిస్తూ, ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. ఫలితంగా మూడు రెట్ల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు అనేకమంది రాజకీయవేత్తలు, సినీ సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు, పడుతున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయమైన నదీమ్-శ్రావణ్‌లలో ఒకరైన శ్రావణ్ రాథోడ్ కొవిడ్-19 పాజిటివ్‌గా టెస్టులో నిర్ధారణ అయి, హాస్పిటల్ పాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆయన కండిషన్ క్రిటికల్‌గా ఉంది.
ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారనే సమాచారంతో ఫ్యాన్స్ ఆందోళనలో మునిగిపోయారు. ఆయనకు వైద్య చికిత్స అందిస్తోన్న డాక్టర్ కీర్తి భూషణ్ చెప్పిన దాని ప్రకారం శ్రావణ్ ఆరోగ్య స్థితి ఆందోళనకర స్థితిలో ఉంది. ఆయన హార్ట్ ఎన్‌లార్జ్ అయ్యిందనీ, స్పెషలిస్టులైన డాక్టర్ల బృందం ఆయనను సాధారణ స్థితికి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనీ చెప్పారు. ఆ డాక్టర్ల బృందంలో ఫిజీయిన్లు, కార్డియాలజిస్టులు, మరికొంత మంది స్పెషలిస్టులు ఉన్నారు.
శ్రావణ్ ఇప్పటికే డయాబెటిక్ షేషెంట్ అనీ, ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయనీ ఆయన స్నేహితుడు, పాపులర్ గేయరచయిత సమీర్ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాలని సమీర్ కోరారు.
1990ల కాలంలో నదీమ్-శ్రావణ్ బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. అనంతర కాలంలో క్లాసిక్‌గా పేరు తెర్చుకున్న 'ఆషిఖీ' సినిమా వారిని టాప్ పొజిషన్‌లో నిలిపింది. సాజన్, ఫూల్ ఔర్ కాంటే, సడక్, దీవానా, దామిని, హమ్ హై రాహీ ప్యార్ కే, దిల్‌వాలే, బర్సాత్, రాజా, రాజా హిందుస్తానీ, పర్‌దేశ్, ధడ్కన్, రాజ్.. ఇట్లా ఎన్ని మ్యూజికల్ హిట్స్ అందించారో! అలాగే పలు బ్లాక్‌బస్టర్ ప్రైవేట్ ఆల్బమ్స్‌ను కూడా వారు రిలీజ్ చేశారు.