English | Telugu
కృతి చేతిలో ఏడు!
Updated : Apr 11, 2021
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న కథానాయికల్లో కృతి సనన్ ఒకరు. ఏకంగా ఏడు సినిమాలతో 'టాక్ ఆఫ్ బాలీవుడ్' అవుతోంది కృతి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పొంతనలేని జానర్స్ తోనే రూపొందడం.
ఆ వివరాల్లోకి వెళితే.. కృతి టైటిల్ రోల్ లో నటించగా విడుదలకు సిద్ధమైన 'మిమి' ఎమోషనల్ డ్రామా కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న 'హమ్ దో హమారే దో' కామెడీ డ్రామా. ఇక చిత్రీకరణ దశలో ఉన్న 'బచ్చన్ పాండే' మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కాగా.. 'బేఢియా' హారర్ కామెడీ. ఇక త్వరలోనే పట్టాలెక్కనున్న 'ఆదిపురుష్' మైథలాజికల్ మూవీ కాగా.. 'గణపత్' యాక్షన్ థ్రిల్లర్. ఇక 'హౌస్ ఫుల్' ఫ్రాంచైజీలో ఐదో చిత్రంగా రానున్న 'హౌస్ ఫుల్ 5' హిలేరియస్ ఎంటర్ టైనర్.
మొత్తమ్మీద.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కృతి.. ఒకదానితో ఒకటి సంబంధం లేని చిత్రాలతో, పాత్రలతో రానున్న రెండు సంవత్సరాల్లో తనదైన హవా చాటనుందన్నమాట. మరి.. ఈ చిత్రాలతో కృతి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.