English | Telugu

కేబీసీ 13: స‌ర‌స‌మాడిన‌ లేడీ కంటెస్టెంట్.. షో ఆపేయ‌మ‌న్న అమితాబ్‌!

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి 13 కొత్త ప్రోమోలో, కంటెస్టెంట్ అయిన‌ న‌మ్ర‌తా షా అనే క‌థ‌క్ టీచ‌ర్ త‌న‌తో స‌ర‌సాలాడ్డంతో షోను ఆప‌మ‌ని నిర్మాత‌ను అడిగారు అమితాబ్ బ‌చ్చ‌న్‌. కేబీసీ 13 కొత్త ప్రోమోను సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ టెలివిజ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో కంటెస్టెంట్ న‌మ్ర‌తా షాతో ఓ క‌ప్పు టీ తాగేందుకు బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకున్న అమితాబ్, షోను ఆపాల్సిందిగా ప్రొడ్యూస‌ర్‌ను అడ‌గ‌డం క‌నిపించింది.

న‌మ్ర‌త‌తో మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నార‌నీ, మీ నెక్లెస్ బాగుంద‌నీ అమితాబ్ మెచ్చుకోవ‌డంతో ఆ ప్రోమో స్టార్ట‌యింది. "మిమ్మ‌ల్ని అమిత్ జీ అని పిల‌వ‌వ‌చ్చా?" అని ఆమె అడ‌గ‌గా, అమిత్ అని పిలిస్తే చాలున‌ని జ‌వాబిచ్చారు బిగ్ బి. "ప్రొడ్యూస‌ర్ జీ, ఈ కార్య‌క్ర‌మం బంద్ చేయండి. మేం న‌మ్ర‌త గారితో చాయ్ తాగ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నాం" అని ఆయ‌న అన్నారు.

న‌మ్ర‌త‌తో పాటు మ‌రో ఇద్ద‌రు కంటెస్టెంట్లు ఉన్న ఇంకో ప్రోమోను కూడా సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ టెలివిజ‌న్ షేర్ చేసింది. అందులో ఒక కంటెస్టెంట్ కోటి రూపాయ‌ల ప్ర‌శ్న ఎదుర్కోవ‌డం గ‌మ‌నార్హం.

'క‌ళంక్' మూవీలోని "ఘ‌ర్ మోరే ప‌ర్‌దేశియా" సాంగ్‌కు న‌మ్ర‌త డాన్స్ చేశాక‌, "ఇన్నిసార్లు మీరు గిర‌గిరా తిరిగారు, మీకు త‌ల తిప్ప‌డం లేదా?" అని అడిగారు అమితాబ్‌. ఆమె స‌ర‌సంగా, "మీ క‌ళ్లు ఒక విష‌యం మీద స్థిరంగా ఉంటే, మీ త‌ల ఎప్పుడూ తిర‌గ‌దు." అని జ‌వాబిచ్చారు. దాంతో ఆయ‌న "హాయీ" అన్నారు. త‌ర్వాత ఆమె, "మీరు ఎంత యంగ్‌గా క‌నిపిస్తున్నారు!" అని అన‌డంతో, అమితాబ్ ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.