English | Telugu

రాజ‌స్థాన్‌లో కంటే ముందుగా ముంబైలో క‌త్రినా-విక్కీ పెళ్లి!

డిసెంబ‌ర్‌లో రాజ‌స్థాన్‌లో బాలీవుడ్ తార‌లు క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ పెళ్లి వేడుక‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. కొంత కాలంగా ఆ జంట డేటింగ్‌లో వున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఎన్న‌డూ ఆ ఇద్ద‌రూ దాన్ని బ‌హిర్గ‌తం చేయ‌లేదు. అందువ‌ల్ల వారి వివాహం విష‌యంలో అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌వారు కూడా అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ అయితే 'VicKat' అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైర‌ల్ చేస్తూ, త‌మ ఆరాధ్య‌తార‌ల పెళ్లికి క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. క‌త్రినా, విక్కీ డిసెంబ‌ర్ మొద‌టి వారాంతంలో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వినిపిస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌చారంలో ఉన్న తేదీ కంటే ముందుగానే వారు దంప‌తులు కానున్నార‌ని తాజాగా తెలియ‌వ‌చ్చింది.

రాజ‌స్థాన్‌లో జ‌రిగే భారీ వివాహ వేడుక‌కు ముందుగానే ముంబైలో వారు చ‌ట్ట‌బ‌ద్ధంగా ఒక‌టి కానున్నార‌ని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. క‌త్రినా స‌న్నిహిత వ‌ర్గాల ప్ర‌కారం జైపూర్ లోని రంథ‌మ్‌బోర్ ద‌గ్గ‌ర‌వున్న‌ వెళ్ల‌డానికి ముందుగా వారు ముంబైలో రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. రాజ‌స్థాన్‌లో రెండు ర‌కాల వివాహ వేడుక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌తి విష‌యాన్ని గోప్యంగా ఉంచాల‌ని క‌త్రినా కోరుకుంటున్నందు వ‌ల్ల ఎవ‌రూ వారి వివాహ వేడుక‌కు గురించి బ‌హిరంగంగా మాట్లాడ‌టం లేద‌ని స‌న్నిహితులు అంటున్నారు. అందుకే నిశ్శ‌బ్దంగా ఇద్ద‌రూ పెళ్లికి ప్రిపేర్ అవుతున్నారు.

విక్కీ త‌న వ‌ర్క్ క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉండ‌గా, క‌త్రినా ఇప్ప‌టికే వ‌ర్క్ నుంచి బ్రేక్ తీసుకొని వెడ్డింగ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. విక్కీ షూటింగ్‌లో ఉండ‌టంతో పెళ్లికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను క‌త్రినా, విక్కీ వాళ్ల‌మ్మ‌, విక్కీ సోద‌రుడు స‌న్నీ చూసుకుంటున్నారు. కాగా, అతి త్వ‌ర‌లోనే ఫ్యాన్స్ కోసం త‌మ పెళ్లికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను విక్కీ-క‌త్రినా చేయ‌నున్న‌ట్లు వినిపిస్తోంది. ముంబైలో రిజిస్ట‌ర్ మ్యారేజ్‌కు ముందు ఈ ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.