Read more!

English | Telugu

'కేజీఎఫ్-2' దెబ్బకి 'జెర్సీ' పోస్ట్ పోన్

సౌత్ సినిమాల జోరు ముందు బాలీవుడ్ సినిమాలు నిలబడలేకపోతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన 'ఎటాక్' కొట్టుకుపోయింది. ఇప్పుడు 'కేజీఎఫ్-2' టైం స్టార్ట్ అయింది. 'కేజీఎఫ్-1' క్రేజ్ తో హిందీలో 'కేజీఎఫ్-2' అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. నార్త్ ఆడియన్స్ నుంచి 'కేజీఎఫ్-2'కి వస్తున్న రెస్పాన్స్ దెబ్బకి 'జెర్సీ' వాయిదా పడింది.

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' మూవీ అదే పేరుతో హిందీలో రీమేక్ అయింది. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో సంచలన విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకి గౌతమే దర్శకుడు. కరోనా కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 14 న విడుదలకు సిద్ధమైంది. అయితే అదే రోజున 'కేజీఎఫ్-2' విడుదల ఉండటం, ఆ సినిమాకి హిందీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చివరి నిమిషంలో జెర్సీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం నార్త్ లో మాస్ సినిమాల జోరు ఎక్కువగా ఉంది. 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2' వంటి సినిమాలు చూడటానికి చూపించిన ఆసక్తి 'జెర్సీ' వంటి క్లాస్ సినిమాలపై చూపించట్లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఏప్రిల్ 14 న విడుదల కావాల్సిన జెర్సీని ఏప్రిల్ 22 కి పోస్ట్ పోన్ చేశారు.