English | Telugu
ఓటీటీలు గ్రేట్ అంటున్న జాన్వీ బేబీ!
Updated : Jul 15, 2023
జాన్వీ కపూర్ ఓటీటీల గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓటీటీల ఇంపార్టెన్స్ ని మనం విస్మరించకూడదు అని అంటున్నారు జాన్వీ కపూర్. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బవాల్ విడుదలకు సిద్ధమైంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా బవాల్. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఇటీవల దుబాయ్‌లో ఘనంగా జరిగింది.
గుంజన్ సక్సేనా, మిలి, గుడ్ లక్ జెర్రీ తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న జాన్వీకపూర్ సినిమా ఇది. ఇంత మంది స్టార్ కాస్ట్ ఉండి, నితీష్ తివారి లాంటి మేకర్ ఉన్నప్పటికీ, ఓటీటీలో విడుదల కావడం ఏంటని చాలా మంది విస్తుపోతున్నారు. ఈ విషయం గురించి ప్రస్తావించారు జాన్వీ కపూర్. ``ప్రెజెంట్ సిట్చువేషన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల ఇంపార్టెన్స్‌ని మనం విస్మరించకూడదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఓటీటీలు సింహ భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. షాజిద్ నదియడ్‌వాలా, నితీష్ తివారి, వరుణ్‌ధావన్ వంటి వారందరూ నాకన్నా అనుభవజ్ఞులు. వారందరూ సినిమాను ఓటీటీకి ఇచ్చారంటేనే, ఏదో విషయం ఉంటుంది. ప్రేమించి చేసిన ప్రాజెక్ట్‌కి ఎవరూ అన్యాయం చేయరు. వాళ్లు ఈ డీల్‌కి ఒప్పుకున్నారంటేనే, ఇది బెస్ట్ అని అర్థం`` అని అన్నారు. నదియడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన టైమ్‌లెస్ లవ్ స్టోరీ ఇది. ఈ చిత్రం జూలై 21న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.